ఆ తల్లి కడుపు పంట చాల పెద్దది. ఆ పెద్ద గుంపులో చిన్నారి బిడ్డ కూడా ఒకతే ఉండేది. తల్లికూతుర్లు తేనే పలుకుల్ని మాట్లాడుకుంటూ సంతకు పోయిరి. ఏమయిందో ఏమో తెలియదు సంతలో తొక్కిసలాట మొదలయింది. జనం తోసుకుంటూ తొక్కుకుంటూ పారిపోతా వుండారు. ఆ గల్లంతలో తల్లి కూతుళ్ళువిడిపోయిరి. తల్లోక పక్కకి బిడ్దోకపక్కకిచెదిరిపోయిరి.
రవంత సేపటికి గలాటా తగ్గింది. గుంపు నెమ్మదించింది. కానీ ఆ బిడ్డకు తల్లి చిక్కలేదు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డ ఏడుపుని చూస్తూ పోతా ఉండారే కానీ బిడ్డను పట్టించుకున్నవాళ్ళు లేరు. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంది ఇంకా..........
ఆ తల్లి కూతుళ్ళుఎవరనేగామీసందేహం ఇంకెవరు, తల్లి తెలుగమ్మ అయితే బిడ్డ మా హోసూరుగడ్డ. అవునండీ తల్లి కోసం ఈ గడ్డ ఇంకా ఏడుస్తూనే ఉంది.
తల్లికోసం, తల్లినుడికోసం, తల్లినుడిలో మాటకోసం పాటకోసం, చదువు కోసం, చదువును చెప్పించే బడికోసం, తెలుగు ఏలుబడి కోసం.......ఈ గడ్డ పడుతున్న తపనలో నుంచి పుట్టిన ఇరవై పొరుగు తెలుగు కతలివి. సుమారు ఎబైమంది కవులకు రచయితలకు వేదిక ఇది.      -జి. నారాయణ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good