నేను చాలా ఎత్తు నుండి జీవితాన్ని చూశాను. కానీ నిజంగా ఆ ఎత్తు నాది కాదు. జాతరలో నాన్న భుజమెక్కి కూర్చున్న చిన్న కుర్రాడికి దేవుడు దర్శనం త్వరగా లభిస్తుంది. నేను కూడా కొంతమంది భుజాలెక్కి జీవితాన్ని చూశాను. సాహిత్యం, థియేటర్‌, సినిమా, పలు భాషలు నా జీవితంలో తోటి ప్రయాణీకులైన స్నేహితులు, స్నేహితురాళ్లు, అనుబందాలు - ఇలా పెద్ద జాబితానే ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముగియని ఈ ప్రయాణపు సుదీర్గమైన బాటలోని కొన్ని జ్ఞాపకాలని మీ ముందుంచాను. నాకు చదివే సుఖం గురించి తెలుసు. రాసే ఆనందం గురించి వినడమే తప్ప అది ఇంత తీవ్రంగా ఉంటుందని, అలసట కలిగిస్తుందని రాసేవరకు తెలియదు.

అనుభవించినదాన్ని అక్షరాల ద్వారా మరోసారి అనుభూతిలా ఆస్వాదించే సంతోషం అనిర్వచనీయం... - ప్రకాష్‌ రాజ్‌

పేజీలు : 115

Write a review

Note: HTML is not translated!
Bad           Good