ఓవర్‌ నటేశన్‌

'కాస్త చూసి నడువు విక్రా!' అన్నాడు బేతాళుడు.

విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు.

'అపార్థం చేసుకోకు మార్మా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్‌.టి.సి. బస్సు. దానికి ఎన్టీరామారావైనా ఒకటే. ఎకస్ట్రా నటుడైనా ఒకటే.'

విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్తపడ్డాడు.

''విక్రా! నీకు ఆయాసం రాకుండా ఉండగలందులకు ఈ వారం - అప్పుడయితే ఓ డబ్బింగు చిత్రంలో హెవీ సీన్లు చెప్తాను.'' అంటూ మొదలెట్టాడు.

- ''ఓ భట్టి విక్రమార్క మహారాజా! విను, అనగనగా ఓ నటేశన్‌ ఉన్నాడు. 'ఓ' అంటే ఒక అని అపోహపడకు. 'ఓ' అంటే ఇంగ్లీషులో '0' అతని ఇంటి పేరు. పూర్తి పేరు ఓవర్‌ నటేశన్‌. ఉహహ్వహ్వ! అవును రాజా! ఓవర్‌ నటేశన్‌ 'అనగనగా ఒక తల్లి' అనే నే చెప్పబోయే తమిళ డబ్బింగు చిత్రంలో హీరో. నా డైలాగ్‌ డెలివరీ వేరేగా ఉందని భావిస్తున్నావా బాబా!...

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good