ఇస్లామిక్‌ చరిత్రను లోతుగా అధ్యయనం చేయడమేగాక ఆనాటి చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో జరిగిన పరిణామాలను అవగాహన చేసుకొని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇస్లాం సిద్ధాంతాలను అన్వయింపచేస్తూ వివరించగల అతితక్కువమంది ఇస్లామిక్‌ మేధావుల్లో ఎ.జి.నూరాని గారు ఒకరు. చరిత్రను మత మౌఢ్యంతో కాక, హేతుబద్ధమైన, వస్తుగత దృష్టితో పరిశీలిస్తే సమాజానికి ఎంతో ఉపయోగం జరుగుతుంది. రచయిత తాను స్వయంగా చెప్పుకున్నట్లు  2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లీంలలోనూ ముస్లీమేతరల్లోనూ ఇస్లాంకు సంబంధించి ఉనన దురభిప్రాయాలను సవరించేందుకు సాధారణ పాఠకులకు సైతం అర్థమయ్యే భాషలో ఇస్లాం మరియు జిహాద్‌లను అర్థం చేసుకోవడానికి, నేటి ఇస్లామిక్‌ తీవ్రవాదుల చర్యలకు, ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదని సాధికారికంగా తెలియజెప్పడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

పేజీలు :112

Write a review

Note: HTML is not translated!
Bad           Good