Vimukta
విముక్త ఓల్గా ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో - త..
Rs.75.00
Yashobuddha
''యశోధరా! ఇంక ఈ డొల్లతనంలో నేను ఇమడలేననిపిస్తున్నది. సమస్త భోగాల మీదా అసహనం కలుగుతున్నది. నీ బంధ మొకటే నన్ను ఇంకా పట్టి ఉంచుతున్నది. బిడ్డపుట్టిన తరువాత అదీ ఒక బంధమై పెనవేసుకుంటుందేమో'' యశోధర చాలసేపు ఆలోచనలో మునిగి చివరికిలా అన్నది. ''మానవ దు:ఖం గురించి ఆలోచిస్తున్నారు. మానవులందరి పట్లా మీకొక బంధం ..
Rs.100.00
Alajadi Maa Jeevitam
మౌఖిక చరిత్ర వర్క్‌షాపులు స్పారో నిర్వహించిన ప్రాజెక్టులలో అంతర్గత భాగమయ్యాయి. స్త్రీల పాటలు, జానపద పాటలు, రూపకాలు, కథలూ ఇవన్నీ సంప్రదాయకంగా మన సంస్కృతిలోని మౌఖిక చరిత్రగా రూపొందాయి. కాలానికి నిలిచిన ఈ పలుకు చరిత మన మధ్య సజీవంగా ఉండి వర్తమానంలో కూడా ఒక అర్థాన్ని సంతరించుకుంది. ఇప..
Rs.150.00
Tadi Aarani Gaayalu
ఈ పుస్తకం కొందరు స్త్రీల వివాహ జీవితాలకు, జీవిత భాగస్వాములను కోల్పోయిన వారి వియోగ దు:ఖానికీ, ఆ దు:ఖంతో యుద్ధం చేస్తూ తమ జీవితాలను అర్థవంతంగా కొనసాగించే వారి స్థితప్రజ్ఞతకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ఈ పుస్తకంలో కనిపించే విషయం అదే. కానీ ఈ పుస్తకంలో దాగి వున్న మరో అమూల్యమైన వి..
Rs.250.00
Charitra Swaraalu
ఇవి చరిత్ర స్వరాలు సాధారణ చరిత్ర వినిపించని స్వరాలు. దాచేసిన స్వరాలు. చరిత్ర ప్రవాహపు వడీ సుడీ ముంచెత్తబోతుంటే ఎదురీదిన స్వరాలు. భూమ్యాకాశాలలో సగమైన తమ భాగం కోసం ఎలుగెత్తిన పర్జన్య స్వరాలు. ఏళ్ళ తరబడి బిగించిన ఉరిలో చిట్టిన కంఠనాళాల రుథిర స్వరాలు. చీకట్లను దనుమాడే వెలుతురు కరవాలాల కరకు స్వరాలు. క..
Rs.10.00
Pelli Itara Kathalu
'పెళ్ళి యితర కథలు' పుస్తకంలో ప్రయోగం, పెళ్ళి, వెన్నెముక, ఓ పెళ్ళి కథ, ధనయవ్వనం, పబ్బులూ - హక్కులు, ఆల్ ది బెస్ట్ అనే 7 కథలు ఉన్నాయి. ప్రయోగం : నరేంద్రకి ఎటూ పాలుబోవడం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ చిక్కొచ్చి పడుతుందో, భవిష్యత్ జీవితం ఎలా అంధకార బంధురం అవుతుందోననే సందేహంతో సతమతమవుతున్నాడు. ఒక మగవాడ..
Rs.75.00
Palikinchaku Mouna M..
ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన సాహితీ వ్యాసాల సంకలనం ఇది. ఈ సంకలనం లోని వ్యాసాలు: కొ.కు.నవలల్లో ప్రేమ ధృక్పధం ............ స్త్రీల సాహిత్య చరిత్ర - ఒక పరిశీలన ................... గడ్డు రోజులు .............. ఉద్యమాల విమర్శగా సాహిత్యం ................... ఎండమావులు ............. హార్వెస్ట్ కొత్త పద..
Rs.120.00
Rajakeeya Kathalu
'ఈ సంకలనంలో కథలు స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలను తోటి స్త్రీలతో, సమాజంలో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ అల్లబడిన భావజాలానికి సంబంధించిన కథలు. మొదటి కథలన్నీ స్త్రీల శరీరం చుట్టూ పురుషాధిపత్య సమాజం ఎన్ని 'మిత్'లను బలంగా అల్లిందో చెప్పడానికి ప్రయత్నించిన కథలు. చివరి కథలు స్త్ర..
Rs.40.00
Maanavi
ఇరవై ఏళ్ళ సంసారంలో మీ నాన్నకు భార్యగా, మీకు తల్లిగా బతికాను. మీ నాన్న నన్ను ప్రేమించలేదు. నేనూ మీ నాన్నను ప్రేమించలేదు. ప్రేమించాలనే విషయం కూడా నాకు తెలియదు. మీ నాన్న నా భర్త. భర్తకు ఏం చెయ్యాలో, భర్త దగ్గర్నించి ఏం సాధించుకోవాలో నాకు సమాజం చెప్పింది. అదే చేశాను. ఒక భర్తకు భార్య ..
Rs.80.00
Santulita
అక్కినేని కుటుంబరావు నవలలు రాజ్యాంగ నైతికతను ఇముడ్చుకున్న రచనలు. కుల వివక్షను, లైంగిక వివక్షను వాటి క్రూరమైన రూపాలలో చూపిన నవలలు. ప్రజల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన పురాతన సాంఘిక నైతికత పేరు మీద అడ్డులేకుండా జరిగే తీరుకి అద్దం పట్టిన నవలలు. వివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరే సంస్క..
Rs.75.00
Saamanyula Saahasam
ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది' - గురజాడ 'దేశ నిర్మాతలు మీరు కాదు. మేము. అభివృద్ధి క్రమంలోని అన్ని దశలలో మా చురుకైన సహకారం లేకుండా మీ కాంగ్రెసులూ, మహాసభలూ నిష్ప్రయోజనం. మీ స్త్రీలను విద్యావంతులను చేస్తే చాలు దేశం బాగుపడుతుంది. నిన్నా, నేడూ, రేపూ, మానవ జీవితం ఉన్నంత ..
Rs.20.00
Samkalita
వసంతకాలపు అందాలకూ, ఆనందాలకూ మనిషి రోజు రోజుకూ దూరమవుతున్నాడు. సాంఘికంగా తన వసంత కాలాన్ని తాను సృష్టించుకుంటున్నాడు. కొత్త వస్తువులు, కొత్త సరకులు, ఆ సరకుల ఆరాధన, మాయ, కొత్త ఆశలు, అత్యాశలు, కొత్త అమ్మకాలు, కొత్త కొనుగోళ్ళు, చిగురించి వికసించి విప్పారి ఆక్టోపస్లయ్యే షేర్ మార్కెట్..
Rs.70.00
Aakasamlo Sagam
ఆకాశంలో సగం ఓల్గా ఈ నవలకి " ఉదయం"వారపత్రిక1990 నవలలో పోటీలో ప్రథమ బహుమతి లభించింది. “ఆ స్కూలు చాలా మంచి స్కూలు. గుంటురులోని మధ్య తరగతి కుటుంబాల పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలనుకుంటారు. హాస్టల్లోనే ఉన్నా, బడి ఆవరణ దాటి ఎప్పుడూ బైటకి వెళ్ళలేకపోయినా మిగిలిన పిల్లల ద్వారా ..
Rs.80.00
Swetcha
'మొత్తం సమాజాన్ని మార్చటం నాకు చేతకాదని - నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ? నా బతుకు మాత్రమే నే..
Rs.75.00
Bhinna Sandarbhaalu
'నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మ అరిచే అరుపులను విననట్లూ, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు నేనెక్కడ పరాయిదాన్ని కానో, యెక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చో..
Rs.120.00
Anveshi
''ఆడది మోసే బరువులు ఎవరికీ కనిపించవు. ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిపెడుతూ చేసే చాకిరీ, దానివల్ల అందరికీ దొరికే మానసికమైన శాంతీ - దీనికెవరూ విలువ కట్టలేరు. అందరి ఉద్రేకాలకూ ఆనకట్టలా ఉంటూ, తమ తమ ఆవేశాలతో, బాధలతో అందరూ మీద పడటానికి ఒక ఆధారంగా ఉండే ఆడది చేసే పనీ, ఆ బరువూ మీకు అర్థం కాదు. చాలా మంది ఆడవాళ్..
Rs.120.00
Gulaabeelu
''పొద్దున్న మనందరం వేసుకున్న ప్రశ్న వుందే - ఈ దేశాన్ని రక్షించేవారేలేరా అని - ఈ దేశం అప్పుల్లోంచి బైటపడే మార్గమే లేదా అని - ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది. ఈ పల్లెల్లో వుంది. పల్లెల్లో వున్న కూలీలూ, రైతులూ, స్త్రీలు, దళితులూ వీళ్ళ దగ్గరుంది సమాధానం. వీళ్ళు మాత్రమే దేశాన్ని రక్షించగలరు. తమ రక్తం, చెమట..
Rs.75.00
Mrunmayanaadam
'నాలా మాట్లాడే స్త్రీలను భరించడం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలిపడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొుప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకె..
Rs.60.00
Gurajaada Adugujaada
స్త్రీల లైంగికత్వం మీద అంతులేని అధికారం ఉందనుకునే పితృస్వామ్యపు పునాదిపై లేచిన రాజ్యంలో ఈ హింస కొత్తకొత్త రూపాలను ధరిస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటనే ప్రశ్న ఇవాళ స్త్రీలందరినీ వేధిస్తోంది. 'పూర్నమ్మ'లు 'కన్యక'లు మళ్ళీ మళ్ళీ ప్రాణాలు అర్పించాల్సిందేనా? లేదంటే ఏం చెయ్యాలి. స్త్రీలు..
Rs.30.00
Olga Kavitalu Konni
ఈ సంపుటిలో 'రాత్రి'ని గురించి రాసిన కవితలు చాలా ఉన్నాయి. రాత్రిని అనుభవించడంలో స్త్రీ దృష్టిని ఇవి వ్యక్తపరుస్తాయి. పురుష దృష్టితో స్త్రీని ఆనందించడం కాక స్త్రీని అర్థం చేసుకొని తనను సగం తగ్గించుకోవడం అనే పాఠాన్ని ఈ కవితల వల్ల మనం నేర్చుకోవచ్చు. స్త్రీకి కనిపించే ఆ రాత్ర..
Rs.100.00