పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పున: చర్చించి పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్‌ చానళ్ళలో నిశితమైన వ్యాఖ్యానాలకు ప్రసిద్ధుడైన పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషనులో సభ్యుడుగా ఎంపికయిన తొలి హిందీ ఆచార్యుడు. అగ్రవాల్‌ పదిహేడు సంవత్సరాలు జవహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హిందీ బోధించారు. సంస్కృతి: వర్చస్వ్‌ ఔర్‌ ప్రతిరోధ్‌, తీస్‌రా రుఖ్‌, విచార్‌ కా అనంత్‌, శివదాస్‌ సింహ్‌ చౌహాన్‌, కబీర్‌: సాఖీ ఔర్‌ సబద్‌, నిజ్‌ బ్రహ్మ విచార్‌: ధర్మ్‌, సమాజ్‌ ఔర్‌ ధర్మేతర్‌ అధ్యాత్మ్‌ పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ ఇతర రచనలు.
మన సాంస్కృతిక వికాసం గురించీ, దేశీయమైన ఆధునికత గురించీ మనకు పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ ఈ పుస్తకం కొత్త చూపునందిస్తూ ఉంది. కబీరును అధ్యయనం చేయడానికి ఒక నూతన దృక్కోణాన్నీ అందిస్తుంది. మనం ఎప్పుడో ఆలోచించడం మానివేసిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తుంది. - అశోక్‌ వాజపేయీ
కబీర్‌ గురించి అసంఖ్యాక గ్రంథాలు వచ్చాయి. కాని నన్నడిగితే రెండు పుస్తకాల పేర్లు మాత్రమే చెప్తాను. ఒకటి ఆచార్య ద్వివేదీ గారి కబీర్‌. రెండవది పురుషోత్తమ్‌ గారి అకథ్‌ కహానీ ప్రేమ్‌ కీ. - నాంవర్‌ సింగ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good