పుస్తకాలు చదవాలనే ఆసక్తిని పిల్లల్లో కలిగించడానికి బాలల కథలు ఎంతో తోడ్పడతాయి. అటువంటి రచనలను ఎంతోమంది రచయితలు, రచయిత్రులు, బాలలకోసం అందించారు. అదేవిధంగా ఈ రచయిత్రి కూడా వెన్నెల్లో కథలు పేరుతో అందించారు. తన కథల్లో సంస్కారం, మానవత్వం, దేశభక్తి వంటి మరెన్నో ఉన్నత విలువలను చేర్చారు. తెలుగు భాష తీయదనం, గొప్పదనం తెలియాలంటే ఇటువంటి కథలొక మంచిమార్గం. వీటివలన మాతృభాష అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు ఈ కథల్ని చదువుతున్నంతసేపూ అమ్మ జోకొడుతూ కథలు చెబుతున్నట్లు, గురువులు పాఠాలు చెబుతూ కథల్ని వినిపించినట్టు, పిల్లలు వెన్నెల్లో ఆడుతూ కథలు చెప్పుకున్నట్టుగా వుంటుంది. ఇటు జ్ఞానం వికసించటమే కాకుండా అటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. అంతేకాదు, ధైర్యసాహసాలు పెంపొందే విధంగా, దేశాభిమానం కలిగే విధంగా వుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good