ఆధునిక తెలుగు సాహిత్యానికి మలుపునిచ్చి గెలుపునిచ్చిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకులకు జ్వరంపుట్టించిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకుల్ని కవుల్ని చేసిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకుల్ని కమ్యూనిస్టుల్ని చేసిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకుల్ని విప్లవకారుల్ని చేసిన మహాకావ్యం 'మహాప్రస్థానం'.

అలాంటి మహాప్రస్థానం సాహిత్యరంగంలోనే కాదు చలనచిత్ర రంగంలోనూ సంచలనాలు సృష్టించింది. 'మహాప్రస్థానం' కావ్యంలోని శ్రీశ్రీ గీతాలను ఎన్నో చలనచిత్రాలలో కొన్ని యథాతథంగానూ, కొన్ని కొద్ది కొద్ది మార్పులతోనూ ఉపయోగించారు. ఒక్క 'మహాప్రస్థానం' లోని గేయాలే, పాతికపైచిలుకు చలనచిత్రాలలో పాటలుగా, మాటలుగా వెలువడి శ్రోతలను అలరించడం, కవి ప్రశస్తికీ, కావ్యప్రకాస్తికీ నిదర్శనం.

పేజీలు : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good