వేమన, కబీర్‌ ప్రజాకవులు. ప్రజలకోసం, ప్రజల భాషలో ప్రజల హృదయాలలో శాశ్వతంగా ఉండిపోయే పద్యాలు చెప్పినవారు. తెలుగునాట వేమన పద్యాలు రానివాడు లేడు. అదేవిధంగా కబీర్‌ దోహాలు రాని వ్యక్తి ఉత్తర భారతంలో లేడనడం అతిశయోక్తి కానేరదు. సంప్రదాయాల పేరిట, కాలక్రమేణా సంఘంలో పేరుకొన్న కుళ్ళును కడిగేందుకు కవిత్వాన్ని ఆయుధంగా వాడుకున్నారు కబీర్‌, వేమన లాంటి ప్రజాకవులు. తమిళంలో తిరువళ్ళువర్‌, కన్నడంలో సర్వజ్ఞుడు, మరాఠీలో జ్ఞానదేవుడు, పంజాబీలో గురునానక్‌ లాంటివారు ఇదేకోవకు చెందినవారు. కొందరు మెల్లగా వీచే గాలిలా చెత్తాచెదారాలను ఎగురగొడితే, వేమన, కబీర్‌లు ప్రభంజనంలా సాంఘిక వ్యవస్థలోని అస్తవ్యస్తతను కూకటివ్రేళ్ళతో పెళ్ళగిస్తారు. అందుకే కబీర్‌, వేమనలలో సామ్యం గమనించడం చాలా సులువు. నిజానికి వీరిద్దరూ విభిన్న దేశకాలాలకు చెందినవారు. ఇద్దరి జీవనగమనంలో తేడా ఉంది. అయినా సాంఘిక, ధార్మిక దురన్యాయాలకు ఇద్దరి హృదయాలు ఒకే విధంగా స్పందించాయి. అందుకే వీరు ఒకే తీగెపై మీటిన రెండు రాగాల్లాగ అనిపిస్తారు.

పేజీలు :96

Write a review

Note: HTML is not translated!
Bad           Good