చావుపుట్టుకల రహస్యం తెలిసినవారు ఎవరూలేరు. చావు గురించి హాస్య, వ్యంగ్య రచన చెయ్యటం తేలిక కాదు. మర్కట ముష్టి భల్లూకముష్టి అన్న ఇద్దరు యమభటుల భూలోకప్రయాణంతో నవల మొదలవుతుంది. మర్కట ముష్టివి కోతి చేష్టలు, భల్లూక ముష్టిది సీరియస్‌ నేచర్‌. వీరిద్దరి చిత్రవిచిత్ర చేష్టలు, అనుభవాలే ఈ నవల. కథా క్రమంలో రకరకాల వ్యక్తులు, సంఘటనలు, యమకింకరుల దృష్టి నుంచి భూలోక విశ్లేషణ. చీపురుపల్లి వరహాలయ్య అనే వ్యక్తి ప్రాణాలని భల్లూక ముష్టి, ఓ కోడిపిల్ల ప్రాణాలని మర్కట ముష్టి తీసుకురావాలి. వాళ్ళిద్దరి మాటలు, చేష్టలనిండా హాస్యం, వ్యంగ్యం నింపాలని చూశారు రచయిత. దానితో పాటు రకరకాల వ్యక్తుల మనస్థత్వ చిత్రణ ఈ నవల ప్రత్యేకత.

పాత్రోచిత భాష, సందర్భానుసారంగా పాటలు, తత్వాలు ఈ నవలలో అదనం.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good