ఈ పుస్తకంలో భదంత ఆనంద కౌసల్యాయన్ రచించిన మూడు వ్యాసాలున్నాయి.
మొదటి వ్యాసంలో భారతదేశాన్ని ఘోర పతనావస్థకు చేర్చిన, సమాజనికొక అసాధ్య రోగంగా పరిణమించిన వర్ణవ్యవస్థలోని దురాచారాలకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటును ప్రదర్శించే తీవ్ర సమతావాద అలోచనా ధోరణిని ఆయన మన ముందుంచడు. తర్వాతి రెండు వ్యాసాలు 'రామచరిత మానస్'కు సంబంధించినవి.
మొదటి వ్యాసం 'రామచరిత మానస్‌లో స్త్రీ.' ఇందులో రామచరితమానస్‌లో తులసిదాసు చేసిన స్త్రీ నిందకు, మొత్తం స్త్రీ జాతిపట్ల ఆయన కనపరచిన హేయదృష్టికి వ్యతిరేకంగా భదంత ఆనంద కౌసల్యాయన్ తన కలాన్ని ఝళిపించాడు. ఇక్కడ ఆయన మాతృశక్తిని గౌరవించేవాడుగా, స్త్రీ-పురుషుల సమానతను సమర్థించేవాడుగా మనకు కనపడతాడు. రెండవ వ్యాసం 'రామచరిత మానస్‌లో బ్రాహ్మణవాదం.' ఇందులో అన్యాయాశ్రితమైన బ్రాహ్మణవాద ఆలోచనా ధోరణిని మరింత స్థిరంగా పాతుకుపోయేట్లు చేయడానికి రామచరిత మానస్‌లో తులసిదాసు చేసిన ప్రయత్నంలోని స్వార్థచింతనను, పక్షపాత దృష్టిని ఎండగట్టాడు. - జె. లక్ష్మిరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good