మార్క్సిస్టు పరిశీలనతో అభ్యుదయ రచయితగా సంప్రదాయ యితివృత్తాలకు భిన్నంగా శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో నూతన చైతన్యాన్ని, ఆలోచనలను సమాజానికి కథారచన ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. దు:ఖాన్ని ఆశ్రయించినా ఆ దు:ఖకారణాలను అన్వేషిస్తూ దు:ఖ విముక్తిని కాంక్షిస్తూ కథారచన చేస్తున్న నాలుగవతరం కథా రచయిత. 30కి పైగా కథలకు బహుమతులు అందుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, పూర్తి కాలం కార్యకర్తగా బాధ్యతల స్వీకరణ, రచనలు చేయడం, పుస్తక ప్రచురణ, కార్యక్రమాల నిర్వహణలేగాక, నాటక సాహిత్య సృజనలో నిత్యకృషీవలత్వం, సాహిత్యమే జీవితమైన వాడు వల్లూరు శివప్రసాద్‌.

వాస్తవికత, సమకాలీనతలే పునాదులుగా రాజ్య ద్రోహానికి, రాజకీయ వంచనకూ, సామాజిక దోషాలకూ బలవుతున్న అనాథలు, వృద్ధులు, రైతులు, బలహీనులే శివప్రసాద్‌ కథానాయకులు.

ఈ కథా సంపుటిలో తాజ్‌మహల్‌, కురిసిన మబ్బు, చిరుదీపం, ఎండమావి, మగసిరి, ఇస్‌మిట్టీసే తిలక్‌ కరో!, హంసగీతం, గిట్టుబాటు, తల్లిభూదేవి, పెళ్లి షరతు, చిచ్చు అనే 11 కథలు ఉన్నాయి.

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good