జాక్‌ లండన్‌ రచించిన 'ఉక్కుపాదం' అద్భుతమైన, ప్రతిభావంతమైన రచన. సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ వచ్చిన నవలలు అనేకం ఉన్నాయి. బహుశా ఉక్కుపాదం మొదటి సైద్ధాంతిక రాజకీయ నవల. కాల్పనిక సాహిత్యం చదివేందుకు ఇష్టపడే అనేకమంది పాఠకులు తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రంలాంటి వాటిని చదివేందుకు ఇష్టపడరు. 'ఉక్కుపాదం' ఈ సమస్యకు పరిష్కారం చూపింది. జీవిత సత్యాలను అన్వేషించదలచుకున్నవారికి ఇది చదవటం అనివార్యం. సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి తుది పోరాటంలో తమవైపు వుండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత వున్నది. అలాంటి కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం ''ఉక్కుపాదం''.

ఉక్కు గట్టిదనానికి, పటిష్టతకు చిహ్నం. 'ఉక్కుపాదం' అనగానే మనకు స్ఫురించేది కఠినమైన, నిర్దాక్షిణ్యమైన అణచివేత. పెట్టుబడిదారీ వ్యవస్థను వర్ణించేందుకు ఇంతకంటే సమగ్రమైన 'టైటిల్‌' మరొకటి స్ఫురిచటం లేదు.

'ఉక్కుపాదం' ముక్తవరం పార్థసారథిగారు సమర్థవంతంగా అనువాదం చేశారు.

Pages: 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good