సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం
75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది.
శాస్త్రీయ సంగీతమంటే భయం, లలిత గీతాలంటే నిరాదరం
సినీగీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి, మేల్కొల్పాలి; నవ్వించాలి, కవ్వించాలి
ఇంతగా ప్రభావితం చేసిన ఆ సినీగీతాన్ని మలచిన రూపశిల్పులెవ్వరు?
గహనమైన సాహిత్యాన్ని సైతం సామాన్యునికి హృదయంగమంగా అందించి
నాటకాల బాణీనుండి తప్పించి, వాద్యగోష్టిని తగుపాళ్ళలో మేళవించి
భావస్పోరకంగా గానం చేసి, గుండెలను కదిలించి, రససిద్ధి కలిగించిన
ఆయా గీతకారులు, సంగీతకారులు, గాయనీగాయకులు ఎవరు?
మల్లాది, అశ్వత్థామ, ఎ.ఎం.రాజా - వీరి పేర్లు తెలియని శ్రోతలు కొందరైతే
తోలేటి, ఓగిరాల, బాలసరస్వతి - వీరిపేర్లు తెలియని శ్రోతలు చాలామంది !
తొలి దభాబ్దాల (1931-70)లో తెలుగు సినిమా పాటకు
రంగు, రూపు, రుచి, సమకూర్చిన మహనీయుల గురించి
నేటితరం శ్రోతలకు రఖామాత్ర పరిచయమైనా కలిగించాలనే
ఆకాంక్ష అక్షరరూపం ధరిస్తే..అదే ''సినీగీత వైభవం''.
దాదాపు 75 మంది మహనీయుల జీవనరేఖలు...ఛాయాచిత్రాలు...పాలు పంచుకున్న పాటల నిశ్చల చిత్రాలతో సహా...
'తెలుగుతెర', 'నాటి 101 చిత్రాలు', 'విజయగీతాలు' ద్వారా తెలుగు సినిమా అభిమానుల ఆదరాన్ని చూరగొన్న రచయిత కలం నుండి మరో సాధికార రచన!

Write a review

Note: HTML is not translated!
Bad           Good