జగమే మాయ! బ్రతుకే మాయ!
ఆ రోజుల్లో 'ఘంటసాల' అని ఒకరు ఎక్కడో పాడుతారని పెద్దలెవరో అనగా తెలిసింది. అప్పటికి ఆడవారు పాడుతారని కూడా తెలియదు. అన్ని పాటలూ ఘంటసాలే పాడుతారని కూడా అనుకొన్నానేమో!
అలాంటి అమాయక దశలో పడ్డ ముద్ర ఘంటసాల గారి పాటల ప్రభావం నామీద. నా మీదే కాదు నాతో పాటు పెరిగిన నా తమ్ముడిలో, బావమరుదుల్లో, సహాధ్యాయుల్లో, మా ఉపాధ్యాయుల్లో, అందరిలోనూ ఘంటసాల గారంటే ఒక 'అనురాగం' ఏర్పడిపోయిన దశలో ఆయన పాటలు పాడటం మొదలుపెట్టాను.
అలా నాకు గుర్తున్నంతవరకు పాడిన మొదటి ఘంటసాల గారి పాట 'జయ జయ మహాదేవా...శంభో సదాశివా' అన్న రావణాసురుడి రుద్రసంకీర్తనం ('భూకైలాస్‌' చిత్రంలో రామారావుగారి కోసం పాడింది). - బ్రహ్మానంద

Write a review

Note: HTML is not translated!
Bad           Good