సినిమా మాధ్యమం ద్వారా సమాజ ప్రగతికి, మానవాభ్యుదయానికి, సంఘసంస్కరణకు ఎలా ప్రయత్నించవచ్చో తమ చిత్రాల ద్వారా చాటిచెప్పిన తెలుగు సినీ దర్శక నిర్మాతల్లో ముందువరుసలో పేర్కొనవలసిన వ్యక్తి శ్రీ కె.బి.తిలక్‌.
...అనుపమ సంస్ధ పేరు వినగానే గుర్తుకువచ్చేది హాయిగొలిపే పాటలు, వాటిలోని సంగీత, సాహిత్యాలు.
...అనుపమ తొలిచిత్రం 'ముద్దుబిడ్డ' (1956) విడుదలై 50 సంవత్సరాలైంది. ఆ విధంగా యిది అనుపమ సంస్ధకు స్వర్ణోత్సవ సంవత్సరం. ఈ సందర్భంగా ఈ పుస్తకం వెలువడుతుండడం అభినందనీయం -సినీ విజ్ఞాన విశారద ఎస్‌.వి.రామారావు
'నమో నమో బాపూ, న్యాయమార్గమును చూపు'; 'అమ్మా చూడాలని ఉంది..'; 'నీ ఆశా ఆడియాసా..'; పైలా పైలా పచ్చీసు..'; అందాలరాముడు - ఇందీవర శ్యాముడు'; 'కొండగాలి తిరిగింది, గుండె వూసులాడింది'; ఎవరో వస్తారని, ఏదో మేలు చేస్తారని..'; 'చల్లా చేయి చల్లా చేయి గొల్లభామా..'; 'ఇదేమి లాహిరి, ఇదేమి గారడీ'
భక్తిగీతం కావచ్చు, భావగీతం కావచ్చు, శోకగీతం కావచ్చు, హాస్యగీతం కావచ్చు, విప్లవ గీతం కావచ్చు, ప్రబోధగీతం కావచ్చు, జానపద ఫక్కీ కావచ్చు, విదేశీ బాణీ కావచ్చు - తిలక్‌ గారు రూపొందించిన ఏ పాట తీసుకున్నా అది ఆణిముత్యమే! - వరప్రసాద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good