Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Bommala Raghupati Ve..

      ఆంధ్ర ప్రదేశ్ సంఘ సంస్కర్తల్లో ఒకరు బ్రహ్మరిషి రఘుపతి వెంకట రత్నం నాయుడు. అందరూ వీరిని నాయుడుగారూ అని పిలిచేవారు. వెనుకబడిన కులాల వారి అభున్నతికి  కృషి చేశారు .కలావంతులకు వివాహాలు జరిపించారు . అనాధ బాల బాలికలకై సరనాలయాలు నెలకొల్పారు. బ్రహ్మ సం..

Rs.35.00

Russian Janapada Kat..

అద్భుతమైన బొమ్మలున్న పిల్లల కథలంటే మీలాగే నాకూ చాలా ఇష్టం. అలా మూడు వందల సోవియట్‌ ఇంగ్లీష్‌ పిల్లల పుస్తకాల్ని సేకరించాను. వీటిలో సుమారు రెండు వేల జానపద కథలున్నాయి. ఈ పుస్తకాలతో 'సోవియట్‌ సాహిత్యంలో ఓ సాయంత్రం' అన్న పుస్తక ప్రదర్శన కూడా నిర్వహించాను. మీలో ఎవరైనా ఆ పుస్తక ప్రదర్శన చూశారా? నేను సేకరి..

Rs.100.00

Ramayanam

రామాయణం అంటే రాముడు అనే ఓ గొప్ప రాజు కథ. అతని భార్య సీతను రావణుడనే రాక్షసుడు అపహరిస్తాడు. రాముడు వానరసేన సహాయంతో రావణ సంహారం చేసి సీతను కాపాడతాడు. వాల్మీకి రామాయణం ఆధారంగా పిల్లలకోసం రచించిన అద్బుతమైన గ్రంథం ఇది. సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించే ఆకర్షణీయమైన చిత్రాలను ఆస్వాదిస్తూ పిల్లలు దీన్ని చద..

Rs.395.00

Eesaph Neeti Kathalu

ప్రాచీన గ్రీకుదేశంలో బానిసగా జీవించిన ఈసఫ్‌ అనే కథకుడు చెప్పిన మరపురాని కథల సమాహారమే ఈసఫ్‌ కథలు. ఆసక్తికరంగా సాగే ఈ జంతువుల కథలు పిల్లలకు సూక్ష్మంగా ఉండే నీతులను బోధిస్తూ వినోదాన్నీ మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తాయి. జీవితాన్నీ ప్రకృతినీ అర్థం చేసుకోడానికి ఈ చిట్టిపొట్టి కథలు చాలా ఉపయోగపడతాయి. ఉత్సాహా..

Rs.195.00

Hitopadesam Kathalu

పిల్లలు చదవడానికీ చదివాక తిరిగి చెప్పడానికీ ఇష్టపడే కల్పిత కథలే హితోపదేశ కథలు. జంతువులూ పక్షులూ చెట్లూ కథలలో మాట్లాడటం పిల్లలకు చాలా కుతూహలం కలిగిస్తుంది. బాలల్లో విలువలూ ముఖ్యమైన జీవన నైపుణ్యాలూ ఏర్పడటానికి ఉపయోగపడే ఒకనీతి ప్రతి కథలోనూ ఉంటుంది. కథలన్నింటినీ ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిదిద్దడం జరిగ..

Rs.195.00

Jataka Kathalu

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ కథలనుంచి ఎంపికచేసిన కథలే ఈ జాతక కథలు. బుద్ధుడి పూర్వజన్మల గురించీ ప్రతిజన్మలోనూ జరిగిన ఆసక్తికరమైన సంఘటనల గురించీ ఈ కథలు వివరిస్తాయి. జీవితానికి పనికొచ్చే విషయాలతో పాటు మానసిక ఉల్లాసాన్నీ ఆనందాన్నీ కూడా కలిగించే నీతికథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వినోదభరితంగా సాగుతూ ముచ్చటగొ..

Rs.195.00

Jo Kotte Kathalu

పిల్లలు నిద్రపోవడానికి ముందు చదవాలనిపించే మేలైన కథల సమాహారమే జోకొట్టే కథలు. ఈ అద్భుత కథలు బాలలను ఊహాలోకాల్లో, సాహస, మాంత్రిక, దేవతల, జంతువుల ప్రపంచంలో విహరింపజేస్తాయి. వారు మేల్కొన్న తర్వాత కూడా ఇవి వారి హృదయాలనుంచి చెరిగి పోకుండా ఆ చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పిల్లలు వారి సొంత ప్రపంచ..

Rs.195.00

Tenali Ramakrishnuni..

తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ప్రముఖ కవి. తెలివికీ, సమయస్ఫూర్తికీ పెట్టింది పేరు. అంతేకాదు ఇతను విదూషకుడూ, వివేకీ, విజ్ఞానీ కూడా. ఏరిన ముత్యాలవంటి ఈ కథల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ, కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడంలోనూ తెనాలి రామకృష్ణుడి బుద్ధికుశలత మనకు కనిపిస్తుంది...

Rs.195.00

Sumati - Vemana Neet..

పిల్లలూ, పెద్దలూ ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం 'సుమతి - వేమన నీతి పద్యాలు'. తెలుగులో శతక సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటివి సుమతి, వేమన పద్యాలు. కొన్ని శతాబ్ధాల తర్వాత కూడా ఈ పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచి వున్నాయంటే వాటిలో వున్న గొప్పదనమే కారణం. సుమతి, వేమన పద్యాలు ఎంతో సరళం..

Rs.40.00

Bamma Cheppina Katha..

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథలనుంచి ఎంపిక చేసిన కథలే బామ్మ చెప్పిన కథలు. ఈ కథలు పిల్లలకు విజ్ఞానంతో బాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. దేవుళ్ళూ దేవతలూ పక్షులూ చేపలూ జంతువులూ - ఇంకా ఎన్నో  ప్రత్యేకతలతో కూడిన కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అన్నీ సరళంగా, సంక్షిప్తంగా వుంటాయి. వీటిలోని రంగు రంగుల చిత్రాలు స..

Rs.195.00

Mahabharatam

మహాభారతం భారతీయ ఇతిహాసంలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్ధాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పి..

Rs.395.00

Neeti Kathalu

నీతి కథలు పిల్లలకు వినోదాన్ని కలిగిస్తూ నీతిని బోధిస్తాయి. ముఖ్యమైన జీవన విధానాలను, ఆహ్లాదకరమైన మార్గంలో వారికి బోధించాలంటే ఇదే అత్యుత్తమమైన మార్గం. సరదాగా హాస్యభరితంగా సాగే ఈ కథలను పిల్లలు తమకు ఆపాదించుకుంటారు. ఈ పుస్తకంలోని మరొక అదనపు ఆకర్షణ రంగురంగుల బొమ్మలు.పేజీలు :123..

Rs.195.00

Prasiddha Telugu Pad..

తెలుగు పద్యాలపై ఆసక్తిగలవారూ, తెలుగు భాషాభిమానులూ తప్పక చదవాల్సిన పద్యాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఇందులో మన పురాణ గ్రంథాలు, కావ్యాలు, శతక సాహిత్యంలోని కురువృద్ధుల్‌, గురువృద్ధ బాంధవులనేకుల్‌.. వచ్చినవాడు ఫల్గుణు డవశ్యము గెల్తుమనంగరాదు.. ధనమును విద్యయు వంశం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ..

Rs.50.00

Rajaji

      Chakravarthi rajagopalachari, informally called Rajaji of C.R was a lawyer, freedom fighter, politician, writer, statesman and leader of the Indian National Congress who served as the Chief Minister of madras presidency. Governor of West Bengal, Minis..

Rs.35.00

Nelson Mandela Metch..

ఇవి నెల్సన్‌ మండేలా మెచ్చిన కథలు ఆఫ్రికా నలుమూలల నుంచీ సేకరించిన జానపద కథలు, కథలో ఏనుగులొస్తాయి. దుమ్ములగొండులు వస్తాయి. సాలీళ్లు వస్తాయి. పాములూ వస్తాయి. కుందేళ్లు వస్తాయి. గుంట నక్కలూ వస్తాయి. సింహం రాదా మరి? మనుషులు సరేసరి. భూమి ఎలా పుట్టిందో ఒక కథ చెబుతుంది. ఇంకా ఎన్నెన్నో సంగతులు ఈ కథలు చెబుతా..

Rs.50.00

Panchatantram

      అనగనగా ఒక అడవి ఆ అడివిలోని జంతువులకి రారాజు సింహం , పింగళిక,దమనకులనే గుంట  నక్కలు ఆ రాజుకి నమ్మినబంట్లు , అడవిలోకి కాకతాళీయంగా చేరుకుంది. సంజీవాకం అనే ఎద్దు . ఆ ఎద్దుని చంపి దాని మాసం ఆరగిమ్చాలని ఆశపడాయి. నక్కలు రాజు ఆ ఎద్దుకి అభయం ఇచ్చారు. కాబట్టి ఎద్దుని చపడానిక..

Rs.250.00

Mana Sareeram Katha

పిల్లలూ, పెద్దలూ, తమ దేహం గురించి తెలుసుకొని ఆరోగ్యంగా వుండేందుకు ఉపయోగపడే అత్యద్భుతమైన మానవ శరీర నిర్మాణశాస్త్ర పుస్తకం! ఈ పుస్తకం మానవ శరీరం వివరాలను ఒక కథలాగ చెపుతుంది. ఒక రోజులో తిండి అన్నిసార్లు ఎందుకు తినాలి? ఎందుకంటే తిండి, నీళ్లూ లేకుండా బతకడం వీలుకాదు కనుక. శరీరం లోపల ఏముంది? గుండె, ఊపిరిత..

Rs.50.00

Andersen Kathalu

కదిలే కాళ్ళను, అల్లరిచేసే పిల్లలను కట్టి పడేస్తుంది మంచి కథ. కథలు వినడం ఎంత తేలికో చెప్పడం అంతకష్టం. అందులోనూ చిన్న పిల్లల కథలు రాయడం రాసిన వాటిని ప్రపంచం నలుమూలలా పిల్లలు పెద్దలూ చదివి మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. సరిగ్గా అదే పని చేశాడు హాన్స్‌ క్రిస్టియన్‌ ఏండర్సన్‌. ఆయన చిన్నపిల్లల ప్రపంచంలోకి ప..

Rs.50.00

Teacher Cheppina Kat..

'టీచర్‌ చెప్పిన కథలు'లో ఒక చల్లని మేఘం, తెగిన గులాబి, ఫారంకోళ్ళు, పాలైన కారవే బంగారుకండ్ల, యుద్ధం, జోలాపురం మొనగాడు, ముండ్ల పొదల్లో పూల మొగ్గలు, ఒక జ్ఞాపకం, ఒక్క కథ, ఒక మైనార్టీ కాలేజీ కథ, మాయాజాలం, సదవకురా చెడేవు, మాయల మరాఠీ, బంగారం అనే 14 కథలు ఉన్నాయి.పేజీలు : 96..

Rs.70.00

Vennello Kathalu

పుస్తకాలు చదవాలనే ఆసక్తిని పిల్లల్లో కలిగించడానికి బాలల కథలు ఎంతో తోడ్పడతాయి. అటువంటి రచనలను ఎంతోమంది రచయితలు, రచయిత్రులు, బాలలకోసం అందించారు. అదేవిధంగా ఈ రచయిత్రి కూడా వెన్నెల్లో కథలు పేరుతో అందించారు. తన కథల్లో సంస్కారం, మానవత్వం, దేశభక్తి వంటి మరెన్నో ఉన్నత విలువలను చేర్చారు. తెలుగు భాష తీయదనం, ..

Rs.120.00