ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

తరంగాలు : ''డాక్టరుగారూ! ఓ డాక్టరుగారూ!''

డాక్టరు జ్ఞానాదేవి పేపరు క్రింద పెట్టింది. ఈలోపల తలుపులు బాదిన చప్పుడు వినిపించింది. అప్పుడే భోజనము ముగించి పేపరు పట్టుకుంది. 'గోపూ' అని పిలువబోయి ఆగిపోయింది. వాడు రాత్రి నుండి జ్వరముతో బాధపడుతున్నాడు. ఏ సినిమా చూచినా, యే కథ చదివినా డాక్టర్లను యెంత దర్జాగా చూపిస్తారు వర్ణిస్తారు? తన పని చూడు, ప్రొద్దున లేచి, పిల్లలను సిద్ధం చేసి, బడికి వెళ్లే అనిల్‌కు అన్నీ సర్ది, శ్రీవారికి అన్నీ అందించి, మధ్యాహ్నానికి భోజనము క్యారియర్‌లో సర్ది, ఫలహారం చేసి, తొమ్మిదిగంటలకు డ్యూటీకి వెళ్ళాలి. గోపుకు జ్వరమని, చంటిదాన్ని కాస్త చూడమని పని మనిషఙకి చెపితే అదెంత గీరబోయిందో! చివరకు అంగీకరించినా, తను రావటము పది నిముషాలు ఆలస్యం కాగానే, పసిదాన్ని వదలి వెళ్ళిపోయింది. ఏం మనుష్యులో! కూలి వారికి ఆత్మీయత యెలా వస్తుంది?....

Pages : 230

Write a review

Note: HTML is not translated!
Bad           Good