భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి,? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం.

    రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయానికి హత్తుకునేలా చెప్తుంది.

    ఈ రామకథాసుధలో సుందరకాండ సారవంతమైనది. ప్రత్యేకించి తెలుగువారికి కొంగు బంగారమైనది.

    ఏదైనా ఒక గొప్ప పని ప్రారంభించినప్పుడు కొందరు దీనిని పారాయణ చేస్తారు. ప్రారంభించిన పనిలో అనుకోని అవాంతరాలు వచ్చి పడినప్పుడు కొందరు పారాయణ చేస్తారు. మనశ్శాంతికి కొందరు పారాయణ చేస్తే, మహాలక్ష్యాలను సాధించేందుకు మరికొందరు పారాయణ చేస్తారు. ఇది తెలుగునాట వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం.

    ఈ కాండలో నిస్సందేహంగా మంత్రానికున్న శక్తి ఉంది.

అంతేకాదు

    ఒడుదుడుకులు, జయాపజయాలు, సుఖదు:ఖాలు దాటుకుంటూ నడిచే నిత్యజీవితంలో ప్రాక్టికల్‌గా ఎలా ఆలోచించాలో నేర్పుతుంది సుందరకాండ.

    వైఫల్యపు పొరలలోనే విజయరహస్యాలు దాగి ఉంటాయి. చుట్టుముట్టిన నిరాశా వలయాలలోనే కార్యసాధనోపాయాలు నిక్షిప్తమై ఉంటాయి. వీటిని వెదికి, ఒడిసిపట్టి తలపెట్టిన కార్యం ఎలా సాధించాలో చెప్తుంది యీ కాండ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good