మా అవగాహనలో, స్కైబాబ రాసిన సుల్తానా కథ సారాంశం - 'ఏ ముస్లిం యువతి అయినా ముస్లిం యువకుడిని పెళ్ళాడితే పర్వాలేదు కానీ, ఏ హిందూ యువకుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నా ఆమె (ఏదో ఒకస్థాయిలో) వినాశనం కాక తప్పదు' - అనే.

స్కైబాబ ఇక్కడ రెండు పనులు చేశాడు. ఒకటి : ఒక మతం అంతా చెడ్డవాళ్ళు అనే నిర్థారణ చేశాడు. రెండు : రెండు మతాలని కలపగలిగిన సాధనాలైన, (ఏదో కొద్ది సంఖ్యలో మాత్రమే జరుగుతున్న) - మతాంతర వివాహాలపైన స్పష్టంగా దాడిచేశాడు. ఇది సారాంశంలో కల్తీలేని మతోన్మాందం అని మా అభిప్రాయం.

మతోన్మాద కథ రాసినందుకే ఆయన్ని మేం మతోన్మాది అన్నాం.

దీన్ని వ్యతిరేకించ దలుచుకున్న వాళ్ళు మతోన్మాద కథ రాసిన వ్యక్తిని ఏమనాలో చెప్పాలి.

పేజీలు : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good