కొవ్వలి లక్ష్మీనరసింహారావు

ఆధునిక ఆంధ్ర వాజ్మయంలో వ్యవహారిక భాషా వ్యాప్తికి నాంది పలికిన వారిలో ప్రముఖులైన సాహిత్య తపస్వి కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912వ సంవత్సరం లక్ష్మీనారాయణ, కాంతమ్మ దంపతులకు కనిష్ఠ పుత్రుడుగా జన్మించారు.

కలం చేత బట్టి తొలి రచనగా 'పల్లెపడుచు' పుస్తకం రాశారు. అందులో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై రచించిన 3 పెద్ద కథలున్నాయి. ఆ తర్వాత ప్రముఖ ప్రచురణ సంస్థ శ్రీ కొండపల్లి వీర వెంకయ్య సంస్థ ద్వారా పుస్తకాలు వెలువరించడానికి షరతులతో కూడిన ఒప్పందం చేసుకున్నారు. వంద పుస్తకాలు పన్నెండున్నర రూపాయలకు అమ్మేటట్లు నిర్ణయం. తన ధ్యేయమైన చదువనూ వ్రాయనూ నేర్చిన ప్రతి మధ్యతరగతి పాఠకుడికి తన రచనలు అందుబాటులో వుండాలన్నది ఆయన ఆశయం. విధి విరామం లేకుండా ఒక సంవత్సరంలో 100 నవలలు రాశారు. వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, వయో వృద్థ వివాహాలు, కుల, మత వర్ణాంతర విభేదాలు ఆయన రచనలకు ఇతివృత్తాలైనాయి.  సాంఘిక దురాచారాల నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు. ఆంధ్రదేశమంతటా నవలా రచయితగా కొవ్వలి పేరు మార్మోగిపోయింది.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good