స్టాక్‌ మార్కెట్‌ మీద అనుభవం గల రచయిత చేత తెలుగులో వెలువడిన అద్భుత పుస్తకం ''స్టాక్‌ మార్కెట్‌లో సంపదని పెంచుకోవడం ఎలా?''

స్టాక్‌ మార్కెట్‌ ! ఆ పదం వింటేనే ఇన్వెస్టర్ల మనసు ఉద్వేగంతో నిండిపోతుంది. కొంతమంది నిద్రలో సైతం షేర్లను కలవరిస్తుంటే, మరి కొంతమంది 'అమ్మో అది రిస్క్‌ గేమ్‌! దాని జోలికి వెళ్ళకూడదు' అని భయపడుతుంటారు. అలా స్టాక్‌ మార్కెట్‌కి రెండు వైపులా పదును వుంది.

తెలుగులో 'స్టాక్‌ మార్కెట్‌' మీద వెలువడిన రెండవ పుస్తకం ఇది.

ఇటీవల కరోనా వల్ల సెన్సెస్‌ 25,000 దాకా పడిపోయింఇ. అయితే మన సెన్సెస్‌ - తిరిగి 38,000 దాకా పెరిగింది.

అయితే వాపును చూసి 'బలుపు' అనుకోకూడదు. ఇప్పటికీ ప్రపంచం ఆర్థిక మాంద్యంతో విలవిలలాడుతోంది. ఇతర ఐరోపా దేశాలు ఆర్థిక విపత్తులతో కదలాడుతున్నాయి. కరోనా ప్రభావం ఇప్పటికీ ప్రతి ఒక్కరిని కలవరపరుస్తోంది.

అందుకే మార్కెట్‌ పెరుగుతోంది కదాని ఏదోక షేర్‌ని కొని చేతులు కాల్చుకోకుండా ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లను కొనాలి. అందుకే ఈ పుస్తకంలో సరికొత్త టెక్నిక్‌లైన ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌, కమోడిటీస్‌ మార్కెట్‌, టెక్నికల్‌ ఎనాల్సిస్‌ల గురించి వివరంగా వివరించాం. వీటితో పాటు ఆన్‌లైన ట్రేడిండ్‌లాంటి సరికొత్త విషయాలు చర్చించాం.

పేజీలు : 94

Write a review

Note: HTML is not translated!
Bad           Good