స్టాక్‌ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరంగా వ్రాయబడిన

స్టాక్‌ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?'

స్టాక్‌ మార్కెట్‌లో ఎప్పుడు ఒకరిని గుడ్డిగా అనుకరించవద్దు. స్నేహితుడు కొన్నాడు అని ఇంకా ఎవరో ఏదో చెప్పారు అని స్టాక్‌లను కొనడం కాకుండా అందులోని సత్యాసత్యాలు తెలుసుకోవడం చేయాలి. మీరు జీవితంలో ఏదైనా వ్యాపారం చేసి మంచి లాభాలు అందుకోవాలి అనుకుంటే, ఆ వ్యాపారం గురించి ఎన్నో వివరాలు కష్టపడి సేకరిస్తారు. కాని స్టాక్‌ మార్కెట్‌ కూడా లాభాలు అందించే సాధనం ఐనప్పటికీ మీరు దాని గురించి కనీసం సమాచార సేకరణ కూడా చేయరు. అటువంటప్పుడు మీరు లాభాలు ఎలా అందుకోగలరు. స్టాక్‌ మార్కెట్‌ను కూడా వ్యాపారం లాగా భావించి ఇన్వెస్ట్‌ చేయాలి. మీరు స్టాక్‌ మార్కెట్‌లో నష్టపోయిన వ్యక్తులను ఎవరినైనా గమనించండి. ఒక స్టాక్‌ను ట్రేడింగ్‌ కొరకు కాని, ఇన్వెస్ట్‌మెంట్‌ కొరకు కాని కొంటున్నప్పుడు ఆ స్టాక్‌ను కొనడానికి గల సరియైన కారణం వివరించగలరో చూడండి. చాలా మంది వివరించలేరు. అలాంటప్పుడు నష్టాలు రాకుండా లాభాలు వస్తాయా?
ఇక రిస్కు అంటారా! రోడ్డు మీద నడవడం రిస్కుతో కూడుకున్నదే. అంతరిక్షంలోకి వెళ్ళటమూ రిస్కే. రిస్క్‌ ఎందుకని కూర్చుంటే సైన్స్‌ ఇంతగా ఎదిగేది కాదు. మానవ జీవితాలు ఇంత సుఖంగా గడిచేవి కావు. ఆర్ధికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎలా ఎదగాలన్నా అందులో రిస్కు ఉంటుంది. అవకాశాలు అంది వచ్చేది రిస్క్‌ తీసుకొనేవారికే కాని, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం రిస్కు తీసుకొనే ముందు మీరు పూర్తిగా మార్కెట్‌ గురించి అధ్యయనం చేయండి. తగినంత నిద్రపోవాలి అనుకుంటే అర్థరాత్రి టెలివిజన్‌ వదలాల్సిందే. పరీక్షల్లో మార్కులు కావాలి అంటే పరీక్షలకు కొద్ది రోజుల ముందు నుండే సినిమాలు, షికార్లు తగ్గించాల్సిందే. అదేవిధంగా షేర్‌ మార్కెట్‌లో లాభాలు పొందాలి అంటే మీరు కష్టపడి మార్కెట్‌ గురించి తెలుసుకోవలసినదే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good