యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద.

శ్రీపాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు. వాటిలో నుంచి ఏరిన మచ్చుముక్కలు యిప్పుడు మీరు చదవబోతున్న ఏడు కథలు. ఈ కథలు (గులాబీ అత్తరు, తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఎ., ముళ్ళచెట్టూ కమ్మనిపువ్వూనూ, కలుపు మొక్కలు, అరికాళ్లకింద మంటలు, ఇలాంటి తవ్వాయి వస్తే, పుల్లంపేట జరీచీర) ఏడూ వాటికవే. ఇవి శాస్త్రి 'కాన్వాసు' చాలా వైవిధ్యమని పాఠకులకు తెలియబరుస్తాయి.

చివరి కథ పుల్లంపేట జరీచీర కూడా దాంపత్యంలోని కమనీయతను వర్ణిస్తుంది. భార్య రాధమ్మకు పండక్కి చీర కొనడానికి తన సరదాలన్నింటినీ మానుకొన్నాడు భర్త యాజులు. ''ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా'' అని అనకండి. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే ఆపేక్షని పెంచి బంధాన్ని బలవత్తరం చేస్తాయి. ప్రేమ ఎలా పెంచుకోవాలో, బంధాన్ని ఎలా బతవత్తరం చేసుకోవాలో అర్థం కాని కుర్రకారు తప్పక చదివి అర్థం చేసుకోవాల్సిన కథలివి.

Pages : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good