ఆంధ్రా 'గోబెల్స్‌' దొంగదాడి కథ

1955 ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సేనానిగా మహాకవి శ్రీశ్రీ నిర్వహించిన పాత్ర అప్పటి కాంగ్రెస్‌ ఐక్య కూటమికి కంటగింపు అయింది. ఏలినవారిపట్ల అచంచలమైన విధేయతతో 'ఆంధ్రపత్రిక' సంపాదకుడు పండితారాధ్యుల నాగేశ్వరరావు 'ఒక రచయిత' అనే పేరుతో 'ఆంధ్ర రచయితల గురుతర బాధ్యత' శీర్షికతో గొప్ప సామిత్య కుట్రకు నాంది పలికాడు. కమ్యూనిజం పేరు వింటే కలలో కూడా కలవరం చెందే 'స్వేచ్ఛాపిపాసు'లైన రచయితలందరినీ కూడగట్టి, అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త అయిన శ్రీశ్రీని కేంద్రంగా చేసుకుని పండితారాధ్యుడు ప్రారంభించిన ఈ దొంగదాడిలో ఆంధ్రప్రభ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు ప్రముఖపాత్ర పోషించాడు. వందలాది మంది రచయితలనూ, కళాకారులనూ సమీకరించి, వారి సంతకాల సేకరణ ద్వారా 'కమ్యూనిస్టు భూతాన్ని' పారద్రోలడానికి నార్ల కొనసాగించిన ఈ వీధి పోరాటానికి పాలగుమ్మిపద్మరాజు, శ్రీరంగం నారాయణబాబు మొదలైనవారు బాసటగా నిలబడ్డారు. కమ్యూనిస్టు భావజాలాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ అతిక్రూరమైనవిగానూ, విదేశీయంగానూ చిత్రించి, సామాన్య పాఠకులను తప్పుదారి పట్టించడంలో నార్ల బృందం కృతకృత్యురాలైంది. సాహిత్యకారులకు రాజకీయాలు ఉండకూడదనీ, జాతీయభావన ఒక్కటే ఊపిరిగా ఉండాలనీ, వారాల తరబడి తమకు విధేయులైన తొత్తులందరిచేతా ఉత్తరాలు రాయించిన ఈ ముఠా చివరకు తన 'రాజకీయ' లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగింది.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good