...నూతన సహస్రాబ్దిలోకి యీ ప్రపంచం అడుగు పెట్టబోయే ముందు, అంటే 1997-99 మధ్య కాలంలో ఒక సలక్షణమైన కలం నుంచి వెలువడిన విలక్షణమైన అలఘలఘ వ్యాసపరంపర యిది! గడిచిన శతాబ్ధిలో వచ్చిన గొప్ప రచనలను ఏకలవ్యుడి వేళ్ల విూ (ఏకలవ్యుడికి నాలుగు వేళ్ళే-పాపం) లెక్కించవచ్చు. ఆ నాలుగింట మూడు మూడున్నర వేళ్ళు యీ రచయితకే ముడవాల్సి వస్తుందనండలో అతిశయోక్తి గాని ఆశ్రిత పక్షపాతం గాని లేవు.

ఈ సంకలనంలో వ్యంగ్యం, హాస్యంతోబాటు నిజాయితీ, మట్టివాసనా ఘటుగా గుబాళించాయి. వర్తమాన పరిస్ధితులపై ఆవేదన, తిరుగుబాటు ధోరణి ద్యోతకమైంది. శ్రీనాధుని చాటువుల్లో కనిపించిన కొంటెతనం, డీపైన భావుకత మళ్ళీ ఇన్నాళ్ళకు శ్రీఛనల్‌లో నాకు వినిపించింది.

మానవతా విలువ తగ్గి, కృత్రిమత్వం పెచ్చరిల్లిపోతున్న యీ రోజుల్లో అత్మ స్తుతి, స్వార్ధం, సోత్కర్ష విశృంఖలంగా విహరిస్తున్న తరుణంలో కొరడా ఝలిపింపులాంటి రచనలు రావల్సిన చారిత్రక అవసరం నేడు ఎంతైనా వుంది.

ఇంకా ఈ రచయిత గురించి ఎన్నో చెప్పాలనీ, చెప్పాల్సినవీ వున్నా సమయ, స్ధలభావాల వల్ల యిక్కడ ఆగాల్సి వస్తున్నందుకు విచారిస్తున్నాము. శ్రీరమణ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good