"ఆశిష్ నంది భవిష్యత్ భారత జాతికి ఒక 'మాగ్నాకార్టా'ను ప్రకటించారు. ఇకముందు - దానిని మరింత సరళీకరించగలిగిన సృజన శక్తుల చొరవ ఇప్పుడు ఇక్కడ మనకు అవసరం. అందుకు 'ఇండియన్ సైక్'లోనే ఓ పెద్ద కుదుపుతో కూడిన బావనాత్మక బదిలీ జరగాల్సి ఉంది. కులీన వర్గాలు వారి అవినీతిలో నిర్లక్షిత వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వడం చిన్న విషయం ఏమీ కాదు. మొదట, అటువంటిది ఒకటి ఉందని సంబంధిత వర్గాలు ఒప్పుకోవడం దగ్గర నుండి ఆ దిశలో తొలి అడుగుపడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఎరుక కూడా మనకు అవసరం. దీనికి ప్రపంచీకరణ తర్వాత, మనం అంగీకరించిన సరళీకరణ ప్రక్రియ కారణమని మనం గుర్తెరగాలి".

Write a review

Note: HTML is not translated!
Bad           Good