పలువురు ప్రముఖ ఇంజనీర్లు భారతీయులకు తెలుసు. వారందరిలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌కు ఒక ప్రత్యేక స్థానం వుంది. ప్రత్యేక తరహాకు చెందినవారు. ఆయన కేవలం ఇంజనీరు మాత్రమే కాదు. ఉత్సాహవంతుడు. గొప్ప భావుకుడు. మానవజాతి అభ్యున్నతికి కృషి చేయాలన్న దీక్ష, దక్షత కలవాడు.

మన మాతృభూమి గురించి ''లేదురా ఇటువంటి భూమి ఇంకెందు'' అని మనం కీర్తించడం సహజం. కాని, ఆంగ్లేయుడు, సామ్రాజ్యవాదులు నియమించిన ఉద్యోగి అయిన శ్రీ కాటన్‌, మన దేశం గురించి ఆ విధంగా కీర్తించటం, అందుకనుగుణంగా భారతదేశాన్ని తీర్చిదిద్దటానికి కృషి చేయటం ఆయనలోని ప్రత్యేకత. నిజాయితీకి నిదర్శనం.

దక్షిణ భారతదేశానికి సర్‌ కాటన్‌ చేసిన అమూల్యమైన సేవలు ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని, అత్యంత తపనతో, పకడ్బందీగా సమన్వయంతో కూడిన అఖిలభారత ఇరిగేషన్‌, నదీజలాల రవాణా వ్యవస్థకై తాను రూపొందించిన బృహత్‌ పథకం కోసం కాటన్‌ చేసిన ప్రబోధం, కృషి గురించి బహు కొద్దిమందికి మాత్రం తెలుసు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా, ఆ పథకం గురించి ప్రబోధించారు. అనేక సభలలో ప్రసంగించారు. గోష్ఠులలో వివరించారు. బ్రిటీష్‌ పార్లమెంటు కమిటీల ముందు సాక్ష్యం చెప్పారు. భారతదేశంలో ఇరిగేషన్‌, నదీజలాల నావిగేషన్‌ అభివృద్ధి చేయవలసిన అవసరం గురించి నొక్కి చెప్పారు....

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good