సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కూతురు లేడీ ¬ప్‌ రాసిన 'సర్‌ ఆర్ధర్‌ కాటన్‌-ఆయన జీవితం, కృషి'ని మనసు ఫౌండేషన్‌ వారు అనువాదం చయమని అడిగినపుడు సంతోషంగా ఒప్పుకున్నాను.
కాటన్‌ నీటి పారుదల (ఇరిగేషన్‌) శిల్పి (ఇంజనీర్‌). కాలువలు, నదులు, నీటి వనరుల గురించి శ్రమించినవాడు. నేను కూడా రమారమి అర్థ శతాబ్దంపాటు ఆ శాఖలోనే శ్రమిస్తూ వచ్చాను. అందుచేత అందులోని సాంకేతిక విషయాలు నాకు అర్థమౌతాయని నమ్మాను.
తెలుగు వారు కాటన్‌ని...
నీటివనరులే జాతి సిరులని
జనుల కొఱకే మనిన
కారణ జన్ముడవునీవు
ఇది నీవు పెట్టిన దీపమే...అని స్తుతిస్తే అందులో ఒకరు ఆయన్ని భగీరథుడితో పోల్చారు.
నిత్యగోదావరీ స్నాన
పుణ్య తోయా మహామతి:
స్వరామ్యాంగ్లదేశీయం
కాటనుం, తం భగీరథం
అంటూ.... న్యూటనిక సైన్సు వలన ప్రపంచ దృక్పథంలో ఓ గొప్ప మార్పు వచ్చింది. గత 300 సంవత్సరాలుగా ఈ దృక్పథమే ఆధిపత్యం వహిస్తూ వస్తోంది.
సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాన్ని, కొన్ని నదుల అనుసంధానాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం వాటివలన కలిగే ఇబ్బందుల దృష్ట్యా కాకుండా పెట్టిన పెట్టుబడి, వచ్చే రాబడి, కట్టాల్సిన వడ్డీ అంటూ రూపాయి అణాపైసల వ్యాపారదృష్టి వలన జరగటం ఒక విధి వైపరీత్యం. ఆ దృష్టిని కాటన్‌ వ్యతిరేకించాడు. పాలితుల సుఖాలు, ప్రాణాలు కరువుతో ముడిపడి ఉడటం చేత పాలకులు ధర్మ దృష్టితో, బాధ్యత దృష్టితో, కరువు నివారణ పనులు చేపట్టాలని పదవీ విరమణానంతరం కూడా పోరాటం జరిపిన వాడు కాటన్‌. మన దేశంలోని పూర్వరాజులు ఆ విధంగా నడుచు కొన్నారని ఎత్తి చూపినవాడు. అందుకే ఆయన ఆరాధనీయుడు. - కవన శర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good