సుప్రసిద్ధ బౌద్ధపండితుడు Edward Conze విసుద్ధిమగ్గ మీద ఇలా అభిప్రాయం వ్యక్తం చేసియున్నారు. "ఆచార్య బుద్ధఘోషుని విసుద్ధిమగ్గ (path of purification) 5వ శతాబ్దంలో రచింపబడిన 616 పుటల మహోన్నత అధ్యాత్మగ్రంథం. మానవ రచితములైన అన్ని ఇతర గ్రంథాల్లో ఉన్నట్టి లొసుగులు (faults) బుద్ధఘోష రచనలోనూ- చిరాకును కలిగించేవి- ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోని అత్యున్నత అధ్యాత్మ గ్రంథాల్లో ఒకటి అని చెప్పకతప్పదు. నిర్జనమైన దీవిలో శేషజీవితం గడుపవలసిన నిర్బంధం నాకు ఏర్పడి ఏదైన ఒక పుస్తకం మాత్రమే చేతబట్టుకొనిపోవలసిన పరిమితి కూడా నాకు విధించినచో అట్టీ స్థితిలో నా ఎంపిక ఈ ఒక్క గ్రంథమే అవుతుంది....”
ఇంత ఖ్యాతి గడించిన ఈ అధ్యాత్మిక గ్రంథాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఏడేండ్ల క్రితం శీలం పేరున ఒక చిన్న పుస్తకం, ఐదేండ్ల క్రితం ధ్యానం పేరున మరో పుస్తకం సంక్షిప్తంగా అనువదించి ముద్రించడం జరిగింది. మూడవ పుస్తకంగా ప్రజ్ఞను కూడా అనువదించే పని ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి శీలం ధ్యానం పుస్తకాలు కొన్ని సవరణలతో కొత్త రూపాన్ని సంతరించుకొని ఏకగ్రంథంగా పాఠకుల ముందుకు వస్తున్నది. ఈ పుస్తకంలో ఒకటి రెండు పేజీలు చదవి ఇదొక శుష్కగ్రంథం (dry book) అని పాఠకులు పొరబడరాదు. భిక్షువుల ఆసక్తికరమైన వృత్తాంతములు 40 పైగానే ఈ పుస్తకంలో అక్కడక్కడా ఉన్నాయి. ఓపిగ్గా చదివేవాళ్ళకు శీలం గురించి ధ్యానం గురించి అనేక విషయాలు ఈ పుస్తకం తెలియజేస్తుంది. మహిమల మీద, అలౌకిక శక్తుల మీద కూడా పాఠకులకు ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ అనువాద గ్రంథంలో కనిపిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good