కథా లోకంలో షేక్స్‌పియర్‌ ఒక ధృవతార. ఒక జీనియస్‌. అన్ని ప్రక్రియలు ఆయనవే. హాస్యం, విషాదం, చరిత్ర, సాహసగాధలు, ప్రేమ కథలు, జానపదాలు - అన్నీ.

షేక్స్‌పియర్‌ నాటకాలు రాశాడు. అవన్నీ పద్య రూపకాలు. మంత్రగత్తెనైనా, చంటిపిల్లనైనా, మృత్యువుతో పోరాడిన వీరాధివీరుడైనా, యువ ప్రేమికుడైనా, వాగుడుకాయయైనా : వ్యక్తుల వివిధ రూపాలను సజీవంగా పట్టుకున్నాడు. శతాబ్ధాలు గడిచినా ఆ నాటకాలు నేటికీ నిత్య నూతనాలుఉ. షేక్స్‌పియర్‌ జీవితకాలంలోనే అతడి నాటకాలకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఆరు నాటకాలు ప్రచురితమైనాయి కూడాను. ఆయన మరణం తర్వాత ఏడేళ్ళకు, 1623లో ఇద్దరు మిత్రులు జాన్‌ హెమ్మింగ్స్‌, హెన్రీ కాండెల్‌ నాటకాలన్నీంటినీ పుస్తకంగా ప్రచురించారు. అదే ''ఫస్ట్‌ ఫోలియో''. ఇందులోని 14 కామెడీలు, 12 ట్రాజెడీల కథలివి. ఇప్పుడు ఆ 26 నాటకాలను క్లుప్తంగా చదవండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good