అమెరికాలోని ప్రవాస భారతీయుల ప్రోత్సాహంతో అనేక సంస్థలు ఒకే వేదిక పైకి వచ్చి ''వరల్డ్‌ విశ్వశాంతి ఫెడరేషన్‌''గా ఏర్పడతాయి. వారి ముఖ్య ఉద్దేశం రామసేతువుపై వాదోపవాదాలు పెంచడం కాక సత్యాన్వేషణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చటమే.

వారి ప్రయత్నాలలో భాగంగా ఒక కోర్‌ టీమ్‌ భారతదేశానికి సత్యాన్వేషణకై వస్తుంది. అందులో ఇద్దరు ప్రవాసభారతీయులు, ఒక శ్రీలంక ఆర్కియాలజిస్టు, ఒక అమెరికన్‌ యువతి వస్తారు.

ఈ శాస్త్రవేత్తల బృందం రామసేతు నిజనిర్ధారణ విషయంలో ఆవిష్కరించిన అద్భుత విషయాలు, వారు ఎదుర్కొన్న జటిల సమస్యలను పరిష్కరించిన తీరు అత్యద్భుతం.

రామసేతువుని నలుని ఆధ్వర్యంలో ఐదు రోజులలో నిర్మించారు. వరుసగా 14, 20, 21, 22, 23 యోజనాల చొప్పున ఐదు రోజులలో నూరు యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు ఉన్న మహాసేతువు నిర్మించబడింది. రోజుకి 20 యోజనాల చొప్పున నిర్మించకుండా ఈవిధంగా వివిధ సంఖ్యలతో నిర్మించడానికి వెనుక ఉన్న దేవరహస్యం ఏమిటి? దానిని ఈ యువబృందం ఎలా కనిపెడుతుంది?

సాగరునిపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు ఎక్కడికి గురిపెట్టాడు? దాని పర్యవసానం ఏమిటి?

యుగయుగాలుగా ఏకపత్నీవ్రతానికి ప్రతీకగా నిల్చిన శ్రీ రాముణ్ణి నేటి యువత ఏ రకంగా అభిమానిస్తారు? అసలైన ప్రేమ చిహ్నం ఎక్కడ ఉంది?

ఆద్యంత ఉత్కంఠ రేకెత్తిస్తూ నడిచిన కథాగమనం. అంతా చదివాక ఇదంతా నిజమేనా, నిజమైతే ఎంత బాగుణ్ణు అనిపించేలా ఉన్న రచనాశైలి మిమ్మల్ని తప్పక ఆకట్టుకుంటాయి.

Pages : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good