ఈ బుక్‌లో ఏముందో మేము చెప్పము. చదివాకా ఇది ఎంత అవసరమో మీకే తెలుస్తుంది.

మనిషి జీవితములో ఎంత కాదనుకున్నా రాసులు, గ్రహముల ప్రబావం తప్పక వుంటుందని ఎన్నో సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. దేవుడు లేడు, గ్రహాలు, రాసులు, జ్యోతిష్యం అంతా ట్రాష్‌ అనే వారితో సమస్యేలేదు.

కేవలం జ్యోతిష్యాన్ని, గ్రహాలు, రాసుల ప్రభావాన్ని నమ్మేవారికోసం, పిల్లలు పుట్టగానే జాతక చక్రాలు వేయించుకునేవారికోసం, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టించుకునే వారికోసం, తమ బిడ్డల భవిష్యత్తు ఎలా వుంటుందో తెలుసుకునేవారికోసం ఎన్నో గ్రంథాలు వెలువడుతున్నాయి.

అలాంటి వాటి కోవకు చెందినదే 'జ్యోతిర్మణిమాల' అని పిలవబడే అతి ప్రాచీన గ్రంథానికి నవీన రూపము ఈ 'లైఫ్‌ లైన్స్‌'. సామాన్యులకు అర్థంకావడానికి సంస్కృత శ్లోకాలను మినహాయించి వాటి సారాంశౄన్ని మాత్రమే ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది చాలా పురాతన గ్రంథం కనుక ఏనుగులు, గుర్రములు, సవారీలవంటి నాటి వాహనాలను, వ్యవహారాలను ఉపయోగించడం జరిగింది. వాటిని యధాతధంగా వుంచాను. వాటిని ఈ కాలానికి అనుగుణంగా మార్చుకుని అర్థం తీసుకోవాలని మనవి.

ఇందులో ఏదీ నాస్వంతము కాదు. పురాతన గ్రంథాల నుంచి సేకరించినవి మాత్రమే. ఇందులో లోపాలు వుండవచ్చు. కొన్ని విషయాలు ప్రస్తావించి వుండకపోవచ్చు. అలాంటి వాటిని విజ్ఞులు నా దృష్టికి తెస్తే తదుపరి ముద్రణలో వాటిని సవరించుకుంటాను.

ఇది సామాన్యులకు ఉపయోగపడాలనేదే ఈ సేకరణ ఉద్దేశ్యం. అది నెరవేరుతుంది, అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.

- పి.నరసింహారావు

పేజీలు : 208

Write a review

Note: HTML is not translated!
Bad           Good