వాడుకోవాలి, వాడుకోబడకూడదు. టెక్నాలజీని నాపరాయిలా వాడుకో, నీ మెదడుకు పదును పెట్టుకో.

పాఠానికి ఒక థీమ్‌ వున్నట్లే, జీవితానికి ఒక అర్థం వుండాలి. అర్థం లేని బ్రతుకు వ్యర్థం. రసం లేని చెరుకులా.

విజయం వెంట తిరిగితే విజయం రాదు. విజయాన్ని మరచిపోయి కృషిని లక్ష్యం వైపు పరుగెత్తిస్తేనే విజయం దక్కుతుంది.

టైం మేనేజ్‌మెంట్‌కు ముల్లా నసీరుద్దీన్‌ చెప్పిన కథ ఏమిటి?

అత్యున్నత విద్యార్థుల ఏడు గొప్ప అలవాట్లు ఏవి? అందుకు ఏడు ఉపకరణాలు ఏవి?

నేర్చుకోవడానికి నాలుగు స్థంబాలు ఏవి? ఎల్‌.ఎస్‌.ఆర్‌.డబ్ల్యూ అంటే?

చెడిపోయేది, చెడగొట్టేది - ఇదేం స్నేహం? మునిగిపోయేవాళ్లు, ముంచేసేవాళ్ళు - వీళ్ళేం స్నేహితులు?

నిఖిల్‌ మరపును ఎలా జయించాడు?

స్వప్నాలను నిద్ర పోనివ్వకు. జిజ్ఞాసను ఆరిపోనివ్వకు. ఏం చెయ్యాలో తెలియకపోతే దారులన్నీ మూసుకు పోతాయి.

నీ దారి స్పష్టమైనప్పుడే, నీకు తోడు వచ్చేవాళ్ళు నిర్ణయమయ్యారు, నీకు సాయపడే వస్తువులు, పుస్తకాలు... ఒక్కొక్కటీ నిన్ను వెదుక్కుంటూ వస్తాయి.

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good