జీవితాన్ని, జీవితసారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్ధిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించే ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంచిపోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చెందే శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పొందాము. ఈ ప్రపంచపు రాజకీయ పరిస్దితులు, ఆర్ధిక సమస్యలు అలాగే మన కుటుంబ మరి సామాజిక సమస్యలు చాలావరకు హృదయాన్ని నిర్లక్ష్యం చేయడం అనే వాస్తవం మీద ఆధారపడి వున్నాయి. హృదయపు రహస్య సందేశాలను సురక్షితమైన సలహాలుగా మనం లెక్కచేయడం లేదు. వాటిని చాలా సునాయసంగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. రాబోయే కాలంలో హృదయం యొక్క ప్రాముఖ్యం ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోబడుతుంది. మేధస్సును వృద్ధి చేయడానికి మనం విశ్వవిద్యాలయాలను స్ధాపించినట్లుగానే హృదయాన్ని వృద్ధి చేయడం ద్వారా మనస్సును సమన్వయం చేయడానికి కూడా మనం విశ్వవిద్యాలయాలు స్ధాపిస్థాం. ఈ హృదయ మానసాల సమన్వయమే మానవజాతిని బంగారు భవితవైపు నడిపిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good