అన్ని పనులూ అత్యంత శ్రద్ధగా చేసేస్తూ, జీవితాన్ని జీవించటం మరచి పోయేవాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. యుగం సరే- క్షణమెంత గొప్పదో తాత్వికంగా వివరించిన కాలమ్స్‌ ఇవి. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, క్రీడా రంగాలలో విజయాన్నీ, అంతకు మించి తృప్తినీ సాధించిన వారి తీరుకు అద్దం పట్టే గ్రంథం 'అల'. అలతి అలతి పదాలతో, అని చిన్న వాక్యాలతో, అనల్ప భావనలను ఆవిష్కరించిన రచనల సమాహారం ఈ గ్రంథం. వ్యక్తిత్వ వికాస రహస్యాన్ని పట్టి ఇస్తుంది. సునాయాసంగా చదివించుకుంటుంది. ధైర్యం కొరవడినెప్పుడెల్లా దగ్గరుండి భుజం తడుతుంది.

పేజీలు : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good