రాయలసీమ చరిత్ర, సంస్కృతి, రాయలసీమ సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు వీటికి సంబంధించి శ్రీదేవి సాధికారికమైన సమాచారాన్ని సమకూర్చి పెట్టింది. శాస్త్రీయమైన ఆలోచనల్ని వెలిబుచ్చింది. 

- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

ప్రాచీన తెలుగు సాహిత్యంలో రాయలసీమ కృషిని ప్రాదేశిక దృష్టితో అంచనాకట్టితే ఆశ్చర్యం గొలిపే అనేకాంశాలు బయట పడతాయి. ఆధునిక కాలంలో వచ్చిన సంప్రదాయ కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, నాటకం, సాహిత్య విమర్శ, పరిశోధన - ఇలా ఒక్కొక్క ప్రక్రియ విూద ప్రాదేశిక దృష్టితో, రాయలసీమ పరిధిగా పరిశోధనలు జరగాలి, విమర్శలు రావాలి. సాహిత్య చరిత్రలు రావాలి. సమాజంలో వస్తున్న పరిణామాలను పసిగట్టి రాయలసీమ సాహితీపరులు ఈ విషయంలో ఇప్పుడైనా మేల్కొవాలి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలు ముందుండాలి. భవిష్యత్తులో నిందలు మోస్తారు? వాటిని నివారించడానికి ఇప్పుడే ప్రయత్నం మొదలు బెడతారా? అన్నది విశ్వవిద్యాలయాలు నిర్ణయించుకోవాలి. రాయలసీమ సాహిత్యం మీద యోగివేమన విశ్వవిద్యాలయం నిర్మాణాత్మకంగా కృషి ప్రారంభించింది. విడివిడి రచయితల మీద కాకుండా రాయలసీమ పరిధిగా, ఒక్క ప్రక్రియ మీద దశలవారీగా పరిశోధనలు చేయిస్తున్నది. ఈ కృషి ఇతర విశ్వవిద్యాలయాలలో కూడా జరుగుతున్నది. ఇప్పుడు నిర్థిష్టమైన స్పృహతో ఆ కృషి జరగవలసి ఉంది. శ్రీదేవి అస్తిత్వ దృక్పథం నుండి రాయలసీమ కథా సాహిత్యాన్ని విశ్లేషించే ఈ పుస్తకం ఇందుకు బాగా సహకరిస్తుంది.

Pages : 174

Write a review

Note: HTML is not translated!
Bad           Good