తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కాలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కోరిక 1974 వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం.

ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాలలో వచ్చిన మార్పులకు ఈ కథా సంకలనం అద్దం పడుతుంది.

లాటిన్‌ అమెరికన్‌ కవి పాబ్లో నెరుడా అన్నట్లు - కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి; వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి.... 'రుమాళ్ళుగా, సవాళ్ళుగా, ఎర్రెర్రటి జెండాలు''గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ శత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.

పేజీలు : 553

Write a review

Note: HTML is not translated!
Bad           Good