ప్రపంచీకరణ ప్రభంజనం, ఆర్థిక విధానాల సడలింపుతో పాటు మానవ సంబంధాలను కూడా సడలిస్తున్న కాలం ఇది. అటు వినిమయ సంస్కృతి ఇటు వెండి బుల్లితెరలు, అంతర్జాల మహాజాలం యువతను పెడదోవ పట్టిస్తున్న పీడన కాలం ఇది. ఉన్నచోట నిలిచి ప్రబతకలేమనే అభద్రతా, జీవన సౌకర్యాలన్నీ అందుకోవాలనే ఆకాంక్ష, వలసలను ప్రోత్సహించి మనుషులను దూరం చేస్తున్న ఆధునిక కాలం ఇది. జీవితం ఒక పరుగు పందెం అయిన వేళ బ్రతుకులో సున్నితత్వం భావుకత ఎండిపోత్ను కాలం ఇది. మరి ఇక్కడ ఏ ఆశా లేదా? అంటే ఇంతటి వెలితి లోనూ అందరికోసం ఆలోచించే వ్యక్తులు ఈ వెలితిని అధిగమించి, పరిపూర్ణత సాధించి ప్రయత్నించే వ్యక్తులు కూడా వున్నారని, వాళ్లే ఈ ప్రపంచానికి ఆశా దీపాలు అంటారు లలితా శేఖర్‌. ` పి.సత్యవతి

పేజీలు : 127

Write a review

Note: HTML is not translated!
Bad           Good