రాయలసీమ రచయితల వస్తువైవిధ్యాన్ని సాహితీ ప్రేమికులకు అందించే లక్ష్యంతో తయారైన ప్రేమ పరిమళాల కథాగుచ్ఛం ఇది. అందరూ ప్రసిద్ధ రచయితలు కావటం వల్ల వీరి ప్రేమ కథల్లో పఠనీయతతో పాటు పరిణతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాఠకులు మెచ్చిన మధురాంతకం రాజారాం 'ప్రియ బాంధవి', ఆర్‌.ఎస్‌. సుదర్శనం 'మధుర మీనాక్షి', కలువకొలను సదానంద 'పైరు గాలి', కథలతో పాటు సింగమనేని నారాయణ, బండి నారాయణ స్వామి, కేతు విశ్వనాథ రెడ్డి, సన్నపురెడ్డి వెంకటరెడ్డి తదితరుల రచనలు దీనిలో ఉన్నాయి. సామాజిక స్పృహ ప్రేమను ఎలా పండిస్తుందో 'ఓ ప్రేమ కథ' ముచ్చటగా చెపుతుంది. 'వెదురు పువ్వు' ప్రేమోద్వేగంలోని వ్యక్తి మానసిక పరిస్థితిని సహజంగా వ్యక్తం చేస్తుంది. - సీ.హెచ్‌.వేణు

పేజీలు : 279

Write a review

Note: HTML is not translated!
Bad           Good