కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కవితా సంపుటి!

ధిక్కరించకపోతే
దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే
అది కవిత్వమెట్లా అవుతుంది?
*
ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం
కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం
వెతుకుతున్నా
*
పెద్దగా నేర్పిందేమి లేదు
పలకమీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్దించాను
*
జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ
*
ఈ సగం చెవిటి ప్రపంచంలో
ఎవడు ఎక్కువమందిని తనివిదీరా పిలవగలడో
పిలిపించుకోగలడో వాడికి నా వందనాలు
*
డొల్ల మనుషులే ఇమేజ్‌ కల్పించుకుంటారు
మూర్ఖులు దాన్ని ఆరాధిస్తారు
*
ప్రతి మనిషీ బతుకంతా కోర్కెల బరువుల్తో
ఒక కొండనెక్కుతూనే ఉన్నాడు
*
స్త్రీలు భూదేవతలు
సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్ళు

Write a review

Note: HTML is not translated!
Bad           Good