నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుదుడుకుల - ఎత్తుపల్లాల నడిచిందని అనిపిస్తుంది. వైరుధ్యాల పుట్టని తలపిస్తుంది. అయితే నిశితంగా అధ్యయనం చేస్తే వీరిలో క్రమపరిణామం కన్పిస్తుందే తప్ప కప్పదాట్లూ - దూడవేట్లూ అగుపించవు. అందుకే దానికి, రాలూ - రప్పలూ అని పేరు పెట్టుకున్నాడు.
శ్రీ ధర్మారావు గారి శైలి పాఠకుని తరుముకుంటూ ఆసక్తితో చదివిస్తుంది. అందులోనూ ఇంత వైవిధ్య జీవితమున్న సాహిత్యమూర్తి స్వీయచరిత్ర మరింతగా ఆకట్టుకోగలదు. జీవితంలోని నిజమైన కొన్ని సంఘటనలు, కల్పనల కథలకన్నా ఆశ్చర్యాన్ని కల్గిస్తాయని ఓ సామెత. మంచి వ్యక్తిత్వం కలవారి స్వీయచరిత్రలు నిజంగా ఇతర్ల జీవితాలను ప్రభావితం కూడా చేస్తాయి. కారణం అవి పచ్చి నిజాలు కనుక. ఆ విధంగా ఈ చిన్న గ్రంథం ఉపకరిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good