ఋషభ్ దేవ్ శర్మ ఇటీవల హిందీలో రచించిన ప్రేమ కవితా సంగ్రహం 'ప్రేమ్ బనా రహే' హిందీ సాహితీ ప్రపంచంలో మంచి ఆదరణ పొంది, పాఠకులను అతిగా ఆకర్షించింది. ఋషభ్ దేవ్ శర్మ తన దాంపత్య జీవనంలో పొందిన ఆనందాన్ని, తన భార్యామణి తో పంచుకున్న భౌతిక, మానసిక, ఆత్మీయ, దివ్య ప్రేమానుభూతుల్ని 'ప్రేమ్ బనా రహే' సంపుటిలో వివిధ కవితల ద్వారా అత్యంత మధురమైన శైలిలో, చక్కని వాక్య విన్యాసాలతో జోడించి సహృదయ పాఠకులకు కానుకగా అందించారు. ఈ కవితలని వారు ఆయన భార్యామణి శ్రీమతి పూర్ణిమకి అంకితం చేశారు. ఈ కవితల్ని హిందీలో ఆస్వాదించేటప్పుడు హరివంశరాయ్ బచ్చన్ తన భార్య కోసం రాసిన 'మిలన్ యామినీ', 'ప్రణయ పత్రిక ', 'ఆకుల్ అంతర్' కవితలు, అలాగే నిరాలా రాసిన 'తుమ్హారేలియే', 'పత్నీ కె ప్రతి' కవితలు గుర్తుకు రావటం సహజం అని భావిస్తున్నాను. అయితే ఈ ప్రేమకవితలు రాసే విధానంలో కవి ఋషభ్ దేవ్ శర్మ తన మీద జయదేవ్ కవి ప్రభావం ఉన్నట్లు అంగీకరించారు. ఋషభ్ దేవ్ శర్మ కవితల్లో వారి ఉన్నతమైన ప్రేమ మరియు సౌహార్ధ్రత్వంతో కూడిన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good