ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్న కొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన కూడా ఉంటుంది. ఆ కల్పన కూడా యేదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది.

చలం తన 'ఆత్మకథ' రాసుకున్నాడు కదా... మళ్ళీ ఈ జీవితాత్మక నవలెందుకు అని కొందరడిగారు. ఆత్మకథ వేరు - నవల వేరు. ఈ నవల చదివిన వాల్ళకు ఒక స్పష్టమైన చలం జీవితచిత్రం వాళ్ళ ముందుంటుంది. అదే ఆత్మకథ చదివితే ఆయన స్వంత అభిప్రాయాలే ఎక్కువగా కనిపిస్తాయి తప్ప ఆయన యథార్థ రూపం కనిపించదు. - నవీన్‌

Pages : 235

Write a review

Note: HTML is not translated!
Bad           Good