సెల్ఫోన్లు, ఎస్.ఎమ్.ఎస్.లు, ఇంటర్నెట్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా ప్రేమ అక్షరాల దారులను వెతుక్కుంటూనే ఉంది. ఆదివారం ఆంధ్రజ్యోతి, మీడియా హౌస్ పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రేమ లేఖల పోటీకి వ్యక్తమైన అనూహ్య స్పందన ఇందుకు నిదర్శనం. 2006 ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డేను పురస్కరించుకుని ఈ పోటీ నిర్వహించాం. అన్ని వయసుల వారూ ఈ ప్రేమ లేఖల పోటీలో పాల్గొన్నారు. మొత్తం 1200కు పైగా ప్రేమ లేఖలు అందాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన లేఖలను ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రచురించింది. వాటితో పాటు మిగిలిన లేఖల్లో అర్హమైన వాటిని ఎంపికచేసి ఈ సంకలనాన్ని మీ ముందుకు తెచ్చాం.
- డా. గోవిందరాజు చక్రధర్

Write a review

Note: HTML is not translated!
Bad           Good