ప్రేమకన్నా మధురమైనది (5 నవలికలు కలిసిన సంపుటం) - రంగనాయకమ్మ

ప్రేమే మధురమైనది కదా ? దానికన్నా మధురమైనది ఇంకేదో వుందా ? రెండూ మధురమైనవే అయితే, రెండూ మంచి విషయాలే అయితే వాటి మధ్య పోలిక ఎందుకు ? దేని విలువ దానిదే కదా ? దేని మాధుర్యం దానిదేకదా ? అవును. కానీ ఎప్పుడు ? దేని స్థానంలో అది ఆగినప్పుడు ! ఏది ఎలా వుండాలో అలా వున్నప్పుడు ! అప్పుడు దేని విలువ దానిదే. దేని మాధుర్యం దానిదే. కానీ అలా జరగనప్పుడు ? ఒకటి, రెండో దాన్ని దురాక్రమించినప్పుడు ? అప్పుడు వాటి స్థానాల్ని సవరించక తప్పదు ! ఆ పోలిక అవసరమైనప్పుడు ప్రేమ కన్నా మధురమైనది వేరొకటి వుంది ! - అదేమిటో తెలుసుకోవాలంటే రంగనాయకమ్మ గారు రాసిన 'ప్రేమకన్నా మధురమైనది' చదవండి - దానికి ముందుగా దానితోపాటు చుట్టాలు, ఆండాళమ్మగారు, పల్లెటూరు, గోపాలం ప్రేమ కథ అన్న శీర్షికలతో ఉన్న 5 నవలికలు కలిసిన సంపుటానికి రంగనాయకమ్మగారు రాసిన ముందుమాట కూడా చదవండి !

Write a review

Note: HTML is not translated!
Bad           Good