పాటని ఎంత ఆసక్తిగా వింటామో కథనూ అంత ఆసక్తిగా వింటాం.  కథను ప్రేమించడమనేది మనిషి ఆదిమ సహజాతం.  చెడ్డతనాన్ని వధించిన మంచితనం, చెడ్డతనం యొక్క చెడ్డతనం కథగా విన్నప్పుడు మనసుకి మెత్తగా, సూటిగా అర్థమవుతుంది.  అందుకు గురజాడగారు కథను మనిషి 'దిద్దుబాటు' కోసం ఉపయోగించారు.  నేటి కథకులు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు.  వివిధ అస్థిత్వాలుగా వున్న ఈ సమాజపు చిత్రాన్ని సృజనాత్మకంగా విశ్లేషిస్తూ సమ సమాజపు ఆకాంక్షను బలంగా వ్యక్తీకరిస్తున్నారు.  ఈసారి ప్రాతినిధ్యలో అటువంటి కథలు ఇరవై నాలుగు వున్నాయి.  మతాన్ని, కులాన్ని, స్త్రీ పురుష సంబంధాలని, స్త్రీ పురుష చట్రపు ప్రేమని మాత్రమే అనుమతించే చట్టాల సామాజిక నియమాల కురచదనాన్ని, మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని, వర్గ వైరుధ్యాలని ఇవి విశదీకరిస్తున్నాయి.  2014లో వచ్చిన దాదాపు ప్రతి కథనూ విడువకుండా పరిశీలించిన తరువాత ఎంపిక చేసిన కథలు ఇవి.  కానీ దాని అర్థం ఇవి మాత్రమే ఉత్తమ కథలని కాదు, మా వనరుల పరిమితి మమ్మల్ని అంతవరకు మాత్రమే అనుమతించిందని అర్థం చేసుకోవాలి.  - సంపాదకులు, సామాన్యకిరణ్‌ ఫౌండేషన్‌.

ఈ కథల సంపుటిలో బాలమణి, దు:ఖాగ్ని, విత్తనం, సూర్యుని నలుపురంగు రెక్కలు, ప్రేమ కథ - రిఫైన్డ్‌, జాగీరు, పిల్లాడొస్తాడా, థూ..., రెక్కల పెళ్ళాం, ఇస్సాకు చిలక, సెకండ్‌ హస్బెండ్‌, నూనె సుక్క, ఏడో చేప, చాకలి కూడు, కొత్త నెత్తురు, తప్పు, తూకం, పాంచాలమ్మ పాట, ది కప్‌లెట్‌, హత్య, చంద్రన్న, ఐస్‌ క్యూబ్‌, వొదిలెళ్ళిన జోళ్లు, తలుగు, అనగనగా ఓ తల్లి అనే 24 కథలను పొందు పరిచారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good