ఈనాటి మనిషి శాస్త్రపరంగా, సాంకేతికపరంగా అంచనాలకు అందకుండా ఎదిగిపోతున్నాడనే విషయంలో సందేహమేలేదు. అయితే ఇంతటి అపూర్వమైన ప్రగతికి మూలకారణం శతాబ్దాల తరబడిగా కొనసాగిన కృషి తాలూకూ ఫలితమే అని అంగీకరించక తప్పదు. ఈ కృషి ఫలితం ఏ ఒక్కరి ఘనతో కాదు. ఎందరో మేధావుల నిరంతర శ్రమ ఫలితం ఇది. అ¬ రాత్రులు పడ్డ కష్టాలకు ప్రతిఫలం ఇప్పటి నవశకం. ఈ శకానికి మూల పురుషులు నిస్సందేహంగా శాస్త్రజ్ఞులే. వారు ప్రాచీనులైనా, నవీనులైనా సమస్త మానవజాతిని ముందు ముందుకు నడుపుతున్న విజ్ఞానవేత్తలు. ఎన్నో విశ్వ రహస్యాలను శాస్త్రబద్దం చేసి మానవ ప్రయోజనమే పరమావధిగా ఎన్నో ఆవిష్కరణలను వెలువరించిన మహానుభావులు వారు. అట్టివారి జీవిత చరిత్రలను కూలంకషంగా కాకపోయినా కొద్దికొద్దిగా అయినా తెలుసుకోవడం ఎంతో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది. ప్రతి శాస్త్రజ్ఞుని చరిత్ర వెనుకా బోలెడంత పరిశ్రమ ఉంది. ఆలోచన ఉంది. పరిశీలన ఉంది. పరిశోధన ఉంది. ప్రపంచ ప్రసిద్ధులైన కొంతమంది శాస్త్రవేత్తల గురించి కొన్ని విషయాలైనా చర్చించేందుకు పూనుకోవడము ఎంతయినా సమంజసంగా ఉంటుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good