అభాగ్యుడైన కుర్రవాడు బ్రతుకు తెరువు కోసం స్టూడెంటు మెస్సులో 'బాయ్‌'గా చేరి, తనకో భవిష్యత్తు సమకూరిందనుకుంటుండగానే ఏక్సిడెంటులోకి పోవడం 'మహారాజ యోగం' కథ. లేని శౌర్యాలు ప్రదర్శిస్తూ అర్థరాత్రి అరణ్యంలో వేటాడి అడవి పందిని తెచ్చామని బొంకి దాన్ని కోసుకుని, తిని ఆరగించిన రాజ యువకులు తెచ్చింది, కాపలా నాయుడు పెంచుకుంటున్న ఊరపందిని మాత్రమే అని తెలియగానే తలవంచుకునే కథ 'దివాణం సేరీవేట'!

క్రింది తరగతి యువతి శ్మశానంలో రాత్రిపూట వస్తూ అత్యాచారానికి గురై, దయ్యం తాకిడికి చనిపోయిందన్న ఊరివారి నిర్ణయంతో బలయిపోతుంది, 'సీతాలు జడుపడుద్ది' కథ....

'పేరంటాలు గుండం'లో పేద యువతి పట్ల ప్రెసిడెంటుగారి దుర్మార్గం, కుక్కుట చోరుల్లో రాజ యువకుల లేకితనం,'రెండు బంట్లు పోయాయి'లో  పేదరాజుల బాధలు, గాథలు, 'సామంతం' కథలో నీతి నిజాయితీల్లో పేదవారు మహారాజులకన్నా అన్ని వేళలా గొప్ప అని కృష్ణంరాజు అంటి శక్తిమంతంగా రాయటం అభినందనీయం. కొన్ని కథలు ఏ భావాలకూ చూపుడువేలు చూపించకపోవచ్చును. దయ్యాల భయాల, భూతాల స్వర్గాల సరదా, కాలక్షేపాలే కావొచ్చును. అక్కడ కూడా పాత్రల పోషణ, వారి పలుకుల మలుకులూ, మానవ సంఘర్షణా, చిత్రణా ఉత్తమ తరగతిలో రచయితను నిలుపుతాయి. చదివినకొద్దీ రసాలూరిస్తాయి.

Pages : 111

Write a review

Note: HTML is not translated!
Bad           Good