Buy Telugu Natakalu Online at Lowest Prices. Books written by authors like Gurajada Apparao, Valluri Siva Prasad and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Vara Vikrayamu

      సమాజంలో నెలకొని ఉన్న చెడును, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సాహిత్య సేవతో కలంపటి ఉద్యమించిన గురజాడ, కందుకూరి కోవలో కాళ్ళకూరి నారాయణరావు ఒకరు. సంఘంలో వల్లునుకుపోయిన వరకట్న పిసచాన్ని పరద్రోలలనే తపనతో - అవనిలో ఆడదానిగా పుట్టుటే తను చేసుకున్న పాపమా..

Rs.30.00

Saripadani Sangatulu

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించి, బళ్ళారిలో న్యాయవాదిగా తాడిపత్రి (బళ్ళారి) రాఘవ స్థిరపడ్డాడు. విభిన్న భాషలలో దాదాపు అరవై నాటకాలలో పాత్రలు పోషించాడు. నటనలో శాస్త్రీయతకు, అభినయానికి ప్రాధాన్యతనిచ్చాడు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, బెర్నార్డ్‌షా తదితరుల మన్ననలు అందుకొన్నాడు. నాటకరంగ అధ..

Rs.50.00

Kanyasulkam

గురజాడ 150వ జయంతి సందర్భంగా పునర్ముద్రించిన తెలుగునాటకాలలో ఆణిముత్యం కన్యాశుల్కం. వైవాహిక వ్యవస్థ, స్త్రీ దురవస్థ, బాల్య వివాహాలవల్ల శిశు వితంతువుల మూగగోడు, నరమాంస విక్రయం ద్వారా తల్లి దండ్రుల పశుప్రవృత్తి, సంసారుల దొంగచాటు వ్యభిచారం, సానుల బాహాటపు వ్యభిచారంతోటి ప..

Rs.120.00

Kanya Sulkam

ఫోటోలు కూడా ... 'కన్యాశుల్కం' ఒక ఆల్‌టైమ్‌ హిట్‌ నాటకం. తెలుగులో మొదటి ఆధునిక నాటకం. తెలుగు నాటక రంగానికి దిశా నిర్దేశం చేసిన మహత్తర రచన.1909లో రెండోకూర్పును తెచ్చినప్పుడు ఇన్నర్‌ టైటిల్‌ పేజీ మీద ''హాస్యరస ప్రధానమగు నాటకము'' అని అచ్చు వేయించారు. దాన్నిప్పుడు విశాలాంధ్ర వారి తొమ్మిదవ ముద్రణలో చూడవ..

Rs.200.00

25 Natikalu

శివప్రసాద్‌ సాహిత్యంలోకి మొదట కథా రచయితగా ప్రవేశించారు. చాలా కథలకు బహుమతులు గెలుచుకున్నారు. కథకుడిగా ప్రసిద్ధులైన తర్వాత నాటక రంగంలోకి అడుగు పెట్టారు. బహుశా నాటకరంగ మిత్రులు తమకో నాటకం రాసి పెట్టమని కోరినప్పుడే ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టి వుంటారు. స్వతహాగా, మౌలికంగా కథా రచయితగావడం చేత ఆయనకు యితివ..

Rs.350.00

Lavangi

సంస్కృత భాషలో అగ్రశ్రేణి అలంకారీకుడు జగన్నాథ పండితరాయలు. ఆ మహనీయుని జీవిత విశేషాలను మాలభిత్తికలుగా చేసుకొని శ్రీ కె.వి.యల్.యన్. శర్మగారు మహత్తరమైన నాటకాన్ని నిర్మించడం అభినందనీయం. మీ రచనాశక్తికి నా హార్థికాభినందనలు. - సి. నారాయణరెడ్డి పండిత రాయల జీవిత చరిత్రను ఈ 'లవం..

Rs.100.00

Kantabharanamu

సుబ్బిసెట్టి, సోమావధాని, శ్రీరామశాస్త్రి, బంగారమ్మ, నవాబు, కృష్ణరావు పాత్రల ద్వారా హాస్యరస పోషణలో అనితరసాధ్యమైన నేర్పు చూపి పాఠకులను అలరిస్తారు పానుగంటి. క్రీ.శ. 1917 - 1950 లోపు సుమారు 250 ప్రదర్శనాలతో ఆంధ్రదేశమంతా నవ్వులు పంచిన నాటకం 'కంఠాభరణము'.పేజీలు : 144..

Rs.85.00

Mithailu

'వాక్యం రసాత్మకం కావ్యం' అనేది నానుడి అయితే 'జీవితం రసాత్మకం నాటకం' అనేది న్యూనుడి! కావ్యగతమైన లక్ష్యాలకు, లక్షణాలను ప్రతి బిందువులోనూ సదృశ్యం చేస్తూ వాక్యాలు రసాత్మకంగా ఇమిడి రస సిద్ధిని కలుగజేస్తే జీవితానికి వ్యాఖ్యానం లాంటి ప్రక్రియ నాటకం. జీవన రసాస్వాదనకు దోహదపడుతుంది. ప్రజల గుండె చప్పుడు రంగస్..

Rs.150.00

Srikrishna Raayabaar..

    గొప్పింటి బిడ్డలనుండి గొడ్లకాపర్లవరకూ, ఇంటింటా, వాడవాడలా రాగయుక్తంగా పాడుకునే తెలుగు పద్యాలను తెలుగు వారికి అందించి తెలుగు పద్యానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన నాటకం, పద్య ప్రియులందరూ తప్పక చదవాల్సిన నాటకం 'శ్రీకృష్ణ రాయబారము పాండవోద్యోగము''. ..

Rs.50.00

Grameena Nepadhyamlo..

ఈ గ్రంథంలో నాటకాల కథాంశాల విశ్లేషణ, పాత్రల విశ్లేషణలతో బాటు, రచయితల వివరాలు, వీలయినంతవరకు ప్రదర్శనల వివరాలు, రచనల్లో వాడిన గ్రామీణ పదాలు, వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్న సామెతలు, కొన్ని నాటకాలలో ఉపయోగించిన జానపద గేయాలు, కళారూపాలు లాంటి అంశాలను సీతారామయ్యగారు మనకు అందించారు. నిజంగా ఇది గొప్ప పరిశోధనే...

Rs.300.00

Kalaavanilo Karumuri

ఎక్కడ బెల్లం వుంటే అక్కడ చీమలు చేరతాయి అని సామెత. అలా ఎక్కడ నాటకప్రదర్శన వున్నా, పోటీలు వున్నా కొందరు వీరాభిమానులు అక్కడ చేరతారు. అలాంటి వారు 'కారుమూరి సీతారామయ్య' గారు. ఒక పరిషత్తు జరిపిన నాటక పోటీలకు గుణనిర్ణేతలుగా వున్నాం. అపుడు పరిచయము సీతారామయ్యగారు. ఆయన కట్టు, తీరు చూడగానే 'నటుడు' అనిపిస్తుంద..

Rs.60.00

Jeevitardham

''జీవితార్థం'' నాటకంలో ఒక సజీవశిల్పం ఉంది, వేదన ఉంది, ప్రేమ ఉంది, ఆక్రోశం ఉంది. క్షీణించిపోతున్న కుటుంబ విలువల్ని తిరిగి నిలబెట్టాలనే ఆకాంక్షతో రాస్తే సహృదయ ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఒక సినిమాని మించి, ఒక టీవీని మించి ఆంధ్ర ప్రేక్షకులు ఈ నాటకాన్ని చూసి సజల నేత్రాలతో నటీనటుల్ని అక్కున చేర్చుకున్న..

Rs.50.00

Kanyasulkam

'మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అథవా రాసినప్పటికీ అందులో ఏమి పస ఉంటుంది?'' అనేవారికి కన్యాశుల్కంలోని ప్రతీ వాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మన దేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. ..

Rs.100.00

Shishtla Umamaheswar..

ఈ గ్రంథంలోని కథలన్నీ, ఒక లెఫ్టినెంట్‌ తులసి మినహాయిస్తే, తక్కినవన్నీ గ్రామీణుల భాసలో రాయబడ్డాయి. యీ రకం భాష రాయడం బహుకష్టం. ఆదిని కీర్తిశేషుడు గురజాడ అప్పారావుగారు రాశారు. యీనాడు రాస్తున్న యువకుల్లో గోఖలే, చాగంటి సోమయాజులు, యీ శిష్‌ట్లా సమర్థతతో రాయగలరు. గ్రామీణులైన సిపాయీల నోటిలోంచి వచ్చిన మాటలు త..

Rs.220.00

Kanyasulkam

‘ఆరుద్రగారి ఆశీర్వాదంతో ప్రారంభమయిన ’కన్యాశుల్కం’ నాటకానికి ’చిన్న తెర’ రూపం యింతింతై వటుడింతై అన్నట్టుగా విశ్వరూపం దాల్చి నభూత నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకొంది. మహాకవి గురజాడ 115 సంవత్సరాల క్రితం రచించిన నాటకం మొట్ట మొదటిసారిగా యథాతదంగా – దాదాపు 8 గంటల ప్రదర్శన – టీవీలోకి ..

Rs.200.00

Poru Nashtam Pondu L..

 ఈ పుస్తకంలో పిల్లలకోసం సందేశాత్మక నాటికలు పొందుపరిచారు రచయిత. ఈ పరంపరలో యథాలోకం తథావార్త, పోరునష్టం - పొందులాభం, జీవన నైపుణ్యం, తప్పులెన్నువారు, సత్యపాలన వంటి సందేశాత్మక పిల్లల నాటికలు పొందుపరిచారు...

Rs.75.00

Gurajada Rachanalu K..

 ''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ'' ''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాటకాలు ..

Rs.100.00

Kanyasulkam

 ''మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అధవా రాసినప్పటికీ అందులో ఏమి పస వుంటుంది?'' అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతీవాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మనదేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్స..

Rs.150.00

Samayasphoorthy

సుప్రసిద్ధ కథా రచయిత మదురాంతకం రాజారాం గారు ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రాసిన లలిత గేయ నాటికల సంపుటమిది. ప్రదర్శనకు అనుకూలంగా రాసిన ఈ నాటికలు చదవటానికి కూడా ఉత్కంఠభరితంగా రూపొందాయి...

Rs.40.00

Prasidda Telugu Hasy..

ఒక వందేళ్ళ కాలంలో (1900 - 2000) తెలుగులో అసంఖ్యాకంగా వెలువడిన ప్రహసనాలు, హాస్య, వ్యంగ్య నాటికల్లోంచి ఎన్నిక చేసిన యాభై రచనల సంకలనం ఇది. అటు వినోదాన్ని ఇటు సామాజిక ప్రయోజనాన్ని సమపాళ్ళలో రంగరించి ప్రముఖ రచయితలు రచించిన ఈ హాస్య నాటికల సంకలనంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా ఉంది. కలం తిరిగిన గొప్ప కవులు,..

Rs.600.00